
బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, టైమ్ సెట్ చేసుకొని మరీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలుస్తుంటాడు రామ్...
బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, టైమ్ సెట్ చేసుకొని మరీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలుస్తుంటాడు రామ్ చరణ్ (Ram Charan). ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిశారు.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చాడు చరణ్. తన బాబాయ్, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిశాడు. ఈసారి వీళ్ల కలయికకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన ఆఫీస్ కు చరణ్ వచ్చి కలవడం ఇదే తొలిసారి.
మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన రామ్ చరణ్ కు జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బాబాయ్-అబ్బాయ్ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అట్నుంచి అటు క్రికెట్ స్టేడియంకు వెళ్లి ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడు చరణ్.
‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించాడు చరణ్. ఆ టైమ్ లో శిల్పకళావేదిక హోరెత్తిపోయింది. ఇప్పుడు నేరుగా వచ్చి పవన్ ను కలిశాడు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.