పెదాలు పగలడానికి చాలా కారణాలు ఉంటాయి. పొడి వాతావరణం, ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్కావడం, డీహైడ్రేషన్, పెదాలను ఎక్కువగా తడపడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు, రైబోఫ్లేవిన్ (విటమిన్ బి2), ఐరన్, విటమిన్ బి వంటి పోషకాల లోపం వల్ల కూడా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, మందులు, కొన్ని ఆరోగ్య సమస్య వల్ల కూడా పెదవుల పగలవచ్చు.
పెదవులు పగిలితే ఈ సమస్యను తగ్గించడానికి తేనె ఎఫెక్టివ్‌గా సహాయపడుతుందని IRJMETS అధ్యయనం పేర్కొంది. తేనెలో యాంటీమైక్రోబయల్, హ్యూమెక్టెంట్ గుణాలు ఉంటాయి. ఇవి పెదాలను తేమగా ఉంచి, గాయం మానడానికి సహాయపడతాయి. అదేవిధంగా, పెట్రోలియం జెల్లీ చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది.
వీటిని కలిపి ఉపయోగిస్తే ఈ సమస్య త్వరగా తగ్గుతుంది. కొద్దిగా తేనెను మీ పెదాలపై పెట్టి, కొన్ని సెకన్ల పాటు ఆరనివ్వండి. పెదాలను కదపకుండా, వాటిపై కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాయండి. వీటిని పెదాలపై 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత, ఒక కాటన్ బడ్ను వేడి నీటిలో ముంచి, పెదవులను సున్నితంగా తుడవండి. సుమారు 2-5 రోజుల పాటు రోజుకు ఒకసారి ఇలా చేయండి.
పగిలిన పెదవుల సమస్యకు కొబ్బరి నూనె అద్భుత పరిష్కారమని IJPS జర్నల్ పేర్కొంది. ముఖ్యంగా చల్లని, పొడి వాతావరణంలో కొబ్బరి నూనె ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది. రోజుకు కొన్నిసార్లు కొద్దిగా నూనెను పెదవులకు రాస్తే సరిపోతుంది. రెండు రోజుల్లో మీ సమస్య తగ్గిపోతుంది.
పెదవులు పొడిబారడం, పెదవులు పగలడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కాబట్టి, ప్రతిరోజూ కనీసం 2-3 లీటర్ల నీరు త్రాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పొడిగా ఉండే శీతాకాలంలో, గాలిని తేమగా ఉంచడానికి మీ ఇంట్లో హ్యూమిడిఫైయర్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
పగిలిన పెదవులు తిరిగి మృదువుగా మారడానికి కలబంద ఎంతో సహాయపడుతుంది. కలబంద గుజ్జులోని పాలీశీకరైడ్లు.. గాయాన్ని నయం చేస్తాయి. కలబంద గుజ్జును పెదాలకు అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే.. పెదవులు మృదువుగా మారతాయి, పగుళ్ల సమస్య దూరం అవుతుంది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది కూడా పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి