తేనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు రాసుకుంటే అందంగా, మృదువుగా మారుతాయి. ఇది పెదవులను గులాబీ రంగులోకి మారుస్తుంది.
బీట్రూట్ రసాన్ని పెదవులకు రాసి పావుగంట తర్వాత కడిగేసుకోండి.
పంచదారలో తేనె వేసి పెదవులకు రాసుకుని సున్నితంగా రుద్దండి. మృతకణాలు తొలగిపోతాయి. పెదవులు అందంగా, మృదువుగా ఉంటాయి.
కొబ్బరి నూనె పెదవులకు తేమను అందిస్తుంది. రోజుకు రెండుసార్లు పెదవులకు రాస్తే డ్రై అవ్వకుండా ఉంటాయి.
కలబంద గుజ్జును పెదవులకు రాయడం వల్ల పెదవులు డ్రై అవ్వవు. అందంగా, మృదువుగా ఉంటాయి.
గులాబీ రేకులను పాలలో వేసి నానబెట్టి, ఆ పేస్ట్‌ను పెదవులకు రాస్తే పెదవులు అందంగా, మృదువుగా ఉంటాయి.
నిమ్మరసంలో తేనె కలిపి పెదవులకు రాసుకుంటే పెదవుల అందం రెట్టింపు అవుతుంది. మచ్చలు కూడా పోతాయి.
ఒంట్లో నీరు తక్కువ అయితే పెదవులు డ్రై అవుతాయి. తగినంత నీళ్లు తీసుకునేటట్లు చూడండి.
పెదవులు కొరకడం, నాలుకతో తడపడం వల్ల పెదవులు ఇంకా డ్రై అయిపోతాయి. కాబట్టి పెదవులకు తరచూ తడపొద్దు.