
జులై 2వ తేదీన జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ స్థానికత విషయంలో మళ్లీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జులై 2వ తేదీన జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పిలుపునిచ్చారు. తెలంగాణ స్థానికత విషయంలో మళ్లీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌మక్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
ఒకటోతరగతి నుంచి ఏడోతరగతి వరకు ఎక్కడ చదివినా తెలంగాణలో స్థానికులు అని కోర్టు చెబుతోందని కవిత అన్నారు. తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని.. మన వాళ్ల హక్కులు కాపాడటంలో వెనక్కు తగ్గేదేలేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందని కవిత పేర్కొన్నారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం: ఎంపీ రఘునందన్ రావు
రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం.. కేటీఆర్ సెటైర్లు
Read Latest AP News And Telangana News And National News