
వెనెజువెలాలో ఒక నిమిషం వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే ప్రకారం మొదట 7.2 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.
వెనెజువెలాలో ఒక నిమిషం వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే (USGS) ప్రకారం మొదట 7.2 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనలతో రాజధాని కారకస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, భారీ ఆస్తి నష్టం సంభవించింది (Venezuela earthquake 2026).
ఈ వరుస భూకంపాల కారణంగా 10 వేల నుంచి లక్ష మంది వరకు మరణించి ఉండొచ్చని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఇది భూకంప తీవ్రత, జనసాంద్రత, భవనాల నాణ్యత వంటి అంశాల ఆధారంగా రూపొందించిన ప్రమాద అంచనా అని అధికారులు స్పష్టం చేశారు. కాగా, వెనెజువెలా ప్రభుత్వం మరణాల సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు (USGS earthquake warning).
భూకంపాల కేంద్రం కారకస్‌కు పశ్చిమాన ఉన్న మోరోన్ సమీపంలో నమోదైంది. తక్కువ లోతులో భూకంపాలు సంభవించడంతో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి, ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం కలగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి (Venezuela twin earthquakes).
భూకంప ప్రభావం వెనెజువెలాతో పాటు బ్రెజిల్, కొలంబియా ప్రాంతాల్లో కూడా కనిపించింది (Venezuela death toll). ప్రారంభంలో కరేబియన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అనంతరం వాటిని ఉపసంహరించారు. కాగా, మరోసారి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. రెండు భారీ భూకంపాల తర్వాత దాదాపు 20 వరకు ప్రకంపనలు వచ్చాయి.
బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
వెనెజువెలాలో రెండు భూకంపాలు.. కారకస్‌లో వణికిపోయిన భవనాలు..