ఉత్తరాది నుంచి వచ్చే కథానాయికలకు దక్షిణాది చిత్రసీమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ, గౌరవం మరెక్కడా దక్కవనేది జగమెరిగిన సత్యం.
అవకాశాలు ఉన్నంత కాలం టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను దేవాలయాలుగా కీర్తించే ముద్దుగుమ్మలు, ఒక్కసారి ఇక్కడ మార్కెట్ తగ్గగానే బాలీవుడ్ వైపు చూస్తూ సౌత్ ఇండస్ట్రీపై విమర్శల రాళ్లు రువ్వడం చిత్రసీమలో ఒక అలవాటుగా మారిపోయింది. గతంలో రాధికా ఆప్టే, తాప్సి లాంటి ఇలాగే ఛాన్సులు తగ్గగానే సౌత్ ఇండస్ట్రీపై రాళ్లు వేయగా.. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా చేరిపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.గ్లామర్ బొమ్మలుగానే చూస్తారా?తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ జనాన్ని, ప్రేక్షకులను తీవ్రంగా గాయపరిచాయి. హిందీ పరిశ్రమలో నటీనటులకు నటనతో పాటు గ్లామర్‌ను బ్యాలెన్స్ చేసే స్వేచ్ఛ ఉంటుందని చెబుతూ.. సౌత్ ఇండస్ట్రీపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "దక్షిణాది చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అక్కడ హీరోయిన్లను చూసే విధానం, వారి పాత్రలను ప్రశంసించే తీరు అంత గొప్పగా ఏమీ అనిపించదు" అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు.* బాబాయ్‌కి అబ్బాయ్ సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్-చరణ్ ఫోటోలు ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, తెలుగు సినీ అభిమానులు మండిపడుతున్నారు. "ఇంతకాలం ఇక్కడ స్టార్ స్టేటస్ అనుభవించి, ఇప్పుడు అవకాశాలు తగ్గగానే ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతారా?" అంటూ తమన్నాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘బాహుబలి’లో అవంతికగా, ‘సైరా నరసింహారెడ్డి’లో లక్ష్మిగా ఆమెకు దక్కిన నటన ప్రాధాన్యమున్న పాత్రలు ఆమెకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ‘ఓదెల-2’ ప్రమోషన్ల సమయంలో టాలీవుడ్‌ను ఆకాశానికెత్తిన మిల్క్ బ్యూటీ.. ఇప్పుడు ఇలా మాట మార్చడం ఏరు దాటాక తెప్ప తగలేయడమేనని మండిపడుతున్నారు. పరాజయాల ప్రభావమేనా?గత కొంతకాలంగా తమన్నాకు దక్షిణాదిలో ఆశించిన విజయాలు దక్కడం లేదు. ఆమె నటించిన ‘గుర్తుందా శీతాకాలం’, మెగాస్టార్‌తో చేసిన ‘భోళా శంకర్’, గతేడాది వచ్చిన ‘ఓదెల-2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. తమిళంలో ‘జైలర్’లో కావాలా పాటతో కాస్త సందడి చేసినా, ప్రస్తుతం అక్కడ ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే సమయంలో బాలీవుడ్లో దాదాపు ఐదు ప్రాజెక్టులు చేతిలో ఉండటంతోనే.. తమన్నా సౌత్ ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తోందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.* పౌరాణిక యోధుడిగా బాలీవుడ్ 'సుల్తాన్'.. కెరీర్లోనే మోస్ట్ పవర్ఫుల్ రోల్లో సల్మాన్! వారి బాటలోనే తమన్నా కూడా!అవకాశాలు తగ్గినప్పుడు దక్షిణాది చిత్రసీమను టార్గెట్ చేయడం తమన్నాకు ముందే చాలా మంది హీరోయిన్లు చేశారు. ‘లెజెండ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే, ‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్‌కు పరిచయమై ఇక్కడి సపోర్ట్‌తోనే బాలీవుడ్లో స్థిరపడిన తాప్సీ పన్ను గతంలో సౌత్ మేకర్స్‌పై, ఇక్కడి కల్చర్ పై ఇలాంటి విమర్శలే చేశారు. వారు నార్త్‌లో బిజీగా మారి ఇక్కడ రాళ్లు వేస్తే ఒక అర్థం ఉంది కానీ.. తెలుగు, తమిళ పరిశ్రమల వల్లే స్టార్డమ్ తెచ్చుకుని, ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో ‘మిల్క్ బ్యూటీ’గా ముద్ర వేయించుకున్న తమన్నా, ఇలియానా వంటి వారు సైతం ఇదే బాటలో నడవడం విచారకరం. కృతజ్ఞత లేని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలుగులో తమన్నాకు మళ్లీ అవకాశాలు రావడం, ఆమెను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించడం దాదాపు కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.