
దిల్లీ: వివిధ శాఖల సమన్వయంతో ఇటీవల జరిగిన నీట్ (యూజీ)- 2026 పునఃపరీక్ష విజయవంతం కావడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం శ్లాఘించారు.
ఈ సమన్వయం ఇలాగే కొనసాగాలని ఆయన మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివిధ శాఖలు కలిసికట్టుగా పని చేస్తే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని పేర్కొన్నట్లు వివరించాయి. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా నిరోధించేందుకు ప్రధాన మంత్రి సమన్వయ సూత్రాన్ని ఉద్బోధించారు. ఇంధన భద్రత, సముద్రయాన రక్షణ సాధించేందుకు సమష్టిగా కృషి జరగాలని ఆయన గతంలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.