
హైదరాబాద్: టీజీ20 లీగ్లో అన్విత ఖమ్మం ఏసెస్తో జరిగిన మ్యాచ్లో వరంగల్ వారియర్స్ ఘన విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వరంగల్.. 18.
5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. హర్షిత్ చౌదరీ 121* పరుగులతో (62 బంతుల్లో) అదరగొట్టాడు. ఆర్ సిసోదియా 27 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లెవరూ అంతగా రాణించలేదు. ఖమ్మం బౌలర్లలో వెంకట్ 2 వికెట్లు.. ఎం విప్పర్ల, వి రెడ్డి, సి మిలింద్ చెరో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ గుప్తా (54), మిక్కిల్ జైస్వాల్ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. కచ్చి (17), హిమతేజ (23), పి రెడ్డి (20), మిలింద్ (11), విద్యానంద రెడ్డి (6) పరుగులు చేశారు. వరంగల్ వారియర్స్ బౌలర్లలో అబ్దుల్ మాలిక్ 3, అభిషేక్ 3, పల్లెపాటి 2, హుస్సేన్ ఒక వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా టీజీ 20 లీగ్లో అన్విత ఖమ్మం ఏసెస్, వరంగల్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ చిత్రాలను మీరూ చూసేయండి..