
హాలీవుడ్లో ఓ చిన్న హారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. 26 ఏళ్ల కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన 'అబ్సెషన్' చిత్రం భారత్‌లో ఊహించని విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ఇప్పటివరకు మన దేశంలో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచింది.కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాలతో విడుదలైన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (రూ.75 కోట్లు) వసూళ్లను అధిగమించడం విశేషం. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో 'అబ్సెషన్' ప్రస్తుతం 28వ స్థానంలో ఉంది. మరో కోటి రూపాయలు వసూలు చేస్తే 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' (రూ.80 కోట్లు) రికార్డును కూడా దాటేస్తుంది.ఒకప్పుడు యూట్యూబర్‌గా ఉండి, దర్శకుడిగా మారిన 26 ఏళ్ల కర్రీ బార్కర్ ఈ విజయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్‌లో తన సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రేక్షకులు సినిమాలోని సన్నివేశాలను రీక్రియేట్ చేస్తూ కామెడీ వీడియోలు చేయడం, ఫ్యాన్ ఆర్ట్ గీయడం వంటివి చూసి షాక్‌కు గురయ్యానని తెలిపారు.ఈ విజయం అల్గారిథమ్‌ల కంటే ఫిలిం మేకర్స్‌పై నమ్మకం పెంచడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు బార్కర్ పేర్కొన్నారు. యువ దర్శకులు మంచి కాంట్రాక్టులు, క్రియేటివ్ కంట్రోల్ సాధించుకోవాలని సూచించారు. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 334 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.