
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Rotten Samosa Painting Video: ఎవరికైనా సమోసా... పేరు వింటేనే నోరూరుతుంది. సాయంత్రం పూట వేడివేడి టీతో కలిపి సమోసా తింటే ఆ మజానే వేరు.. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం.. మీరు జీవితంలో మళ్లీ సమోసా జోలికి వెళ్లాలంటేనే వణికిపోతారు.. అవును.. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అయిపోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. ఒక యువకుడు పాతపడిపోయిన, కుళ్లిపోయిన సమోసాలకు రంగులు వేస్తూ కెమెరాకు చిక్కాడు. వైరల్ అవుతున్న వివరాల ప్రకారం... ఒక ఇరుకైన, అపరిశుభ్రమైన గదిలో ఒక యువకుడు కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు.. పూర్తిగా పాడైపోయిన, బూజు పట్టిన సమోసాలు కుప్పగా పడి ఉండడం మీరు చూడొచ్చు.. అయితే, వాటిని పారేయడానికి బదులు.. ఆ యువకుడు ఒక బ్రష్‌తో వాటిపై పసుపు, ఎరుపు రంగుల మిశ్రమాన్ని పూయడం మీరు గమనించవచ్చు.. ఆ రంగు వేయగానే.. కుళ్లిపోయిన సమోసాలు కాస్తా.. ఇప్పుడే నూనెలో నుంచి తీసిన తాజా సమోసాల్లా మెరిసిపోవడం గమనార్హం..
ఈ విధంగా రంగులు పూసిన సమోసాలను మార్కెట్లోకి పంపి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో షేర్ అయిన కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్‌తో పాటు వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన చాలా మంది డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో ఇంత దారుణంగా ఆడుకుంటారా? వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక నెటిజన్ కామెంట్ చేయగా... ఇకపై బయట సమోసాలు తినడమే బంద్. ఇంట్లోనే వండుకు తిందాం.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులకు సవాల్‌గా మారిన నకిలీ దందా.. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల తయారీ వీడియోలు బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ కుళ్లిన నూనె వాడటంతో పాటు రసాయనాలు కలపడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమోసాల వీడియో ఎక్కడిది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి రహస్య తయారీ కేంద్రాలపై నిఘా పెట్టాలని.. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి కేటుగాళ్లను జైల్లో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.