
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది.
ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా అనుకోవచ్చు. కానీ కొందరు ప్రేమలో పదేపదే మోసపోతుంటారు. ఇలా పదే పదే జరిగే మోసాలు దురదృష్టం వల్ల కాకుండా మనిషి చేసే పొరపాటు వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు, మనం తెలియకుండానే చేసే పొరపాట్లు పదేపదే మోసాలకు దారితీయవచ్చు. ప్రేమలో పదే పదే మోసపోయే వారు చేసే పొరపాట్లు ఏమిటో.. ఎందుకు జరుగుతాయో.. వివరంగా తెలుసుకుంటే..
ప్రేమలో మోసపోతున్నారని చెప్పడానికి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ తెలుస్తూ ఉంటాయి. అబద్దాలు చెప్పడం, వింతగా ప్రవర్తించడం, విషయాలు దాచడం,కేవలం మాటలు చెప్పడం, చేతల్లో ఏమీ ఉండకపోవడం వంటివి ప్రేమలో మోసపోవడానికి హెచ్చరికలు. ఇవన్నీ చేసే వ్యక్తి ఏదో ఒకరోజు మోసం చేసే అవకాశం ఉంటుంది.
భాగస్వామిని సంతోషపెట్టాలనే కోరికలతో ఆత్మగౌరవాన్ని వదిలి తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటే, అవతలి వ్యక్తి తేలికగా తీసుకుంటారు. అందుకే తమను తాము ఎప్పుడూ ప్రేమించుకుని, గౌరవించుకోవాలి. అది జరగనంత వరకు అవతలి వ్యక్తి విలువ ఇవ్వరు. భాగస్వామి విలువ ఇవ్వనప్పుడు, ఎప్పుడైనా మోసం చేయగలరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ చాలా కీలకం.
చాలాసార్లు, గతంలో విడిపోవడం వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడానికి లేదా తుడిచివేయడానికి, ఆలోచించకుండా కొత్త సంబంధాలను వెతుక్కుంటారు. సంబంధంలోకి వెళ్లడానికి ఎప్పుడూ తొందరపడకూడదు, ఎందుకంటే ఇది అవతలి వ్యక్తిపై మానసికంగా ఆధారపడేలా చేస్తుంది.
భాగస్వామిని గుడ్డిగా నమ్మడం సరికాదు. ఒక సంబంధంలో ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా అవసరం. భాగస్వామిని గుడ్డిగా కాకుండా, తార్కికంగా నమ్మాలి. ఏ సంబంధంలోనైనా నమ్మకం కాలక్రమేణా ఏర్పడుతుంది. భాగస్వామిని గుడ్డిగా నమ్మితే, మోసపోవచ్చు.
ప్రేమలు ఎందుకు విఫలమవుతున్నాయి? అసలు కారణాలివే!
.