
ఆడుదాం ఆంధ్రా అక్రమాలపై విజిలెన్స్ నివేదిక త్వరలోనే బయటకు వస్తుందని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.
100 కోట్లకు పైగా ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు. డీఎస్సీ (DSC) నియామకాల్లో స్పోర్ట్స్ కోటా (Sports Quota) రిజర్వేషన్ అమల్లో సూక్ష్మ లోపాలు కూడా లేవని తేల్చి చెప్పారు. క్రీడల కోటాలో 3 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల గత రెండేళ్లలో 800 మందికి పైగా ఉద్యోగాలు సాధించారన్నారు. ఖేల్ ఇండియా పథకం (Khelo India Scheme) నిధులు రూ.75 కోట్లతో రాష్ట్రంలో మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.