
ప్రైవేటు గోల్డ్ మైనింగ్‌ను ప్రారంభించడం శుభపరిణామం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులోని జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
‘‘జొన్నగిరిని గతంలో స్వర్ణగిరి అని పిలిచేవారు. వందల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండింది. గోల్డ్ మైనింగ్ పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టాం. జొన్నగిరిని తిరిగి స్వర్ణగిరిగా మార్చుకుందామా? ఒకప్పుడు కేజీఎఫ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేది. ఇప్పుడు స్వర్ణగిరి గోల్డ్ఫీల్డ్ గురించి చర్చ జరుగుతుంది’’ అని అన్నారు. 👉మరిన్ని వివరాలు ఒకప్పుడు KGF.. ఇప్పుడు స్వర్ణగిరి: చంద్రబాబు |