
విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణది అదృశ్యం కేసులో కీలక విషయాలు బయటికొచ్చాయి. సాయికృష్ణది లాకప్‌డెత్ అనే విషయం ప్రాథమిక విచారణలో తేలిందని సిట్ అధికారు
లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
‘‘కస్టడీలో తగిలిన గాయాల వల్లే అతను మృతి చెందాడు. సీసీ ఫుటేజీలను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారు. సాయికృష్ణను మే 6న మర్కాపురంలో పట్టుకుని కృష్ణలంకకు తెచ్చారు. కానీ, కస్టడీకి అప్పగించిన తర్వాత అతని ఆచూకీ తెలియలేదు. చట్టవిరుద్ధంగా కస్టడీలో ఉంచారు. గత నెల 6-8 తేదీల్లో సాయికృష్ణను పీఎస్‌లో చూసినట్టు ఎస్ఐ చెప్పారు. నిందితుడిపై పాత కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పీఎస్‌లో సాయికృష్ణ అపస్మారక స్థితిలో ఉండటం చూశానని తల్లి తెలిపింది. మే 1 నుంచి జూన్ 1వరకు కృష్ణలంక పీఎస్‌లో సీసీటీవీ ఫుటేజీ లభించలేదు.
పీఎస్‌కు వచ్చాక సాయికృష్ణ తన సెల్‌ఫోన్‌ను నాగరాజుకు అప్పగించారు. కానీ, అతన్ని సీఐ నాగరాజు మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. లాకప్‌డెత్‌ను దాచేందుకు సాయికృష్ణ శవాన్ని మాయం చేశారు. శవాన్ని పూడ్చిపెట్టడమో, తగలబెట్టడమో చేసేందుకు ప్రయత్నించారు. మృతదేహం ఇంకా లభించలేదు. శవాన్ని ఏం చేశారనే దానిపై దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇది చాలా సంక్లిష్టమైన కేసు.. దర్యాప్తునకు మరింత సమయం అవసరం. సీఐ నాగరాజు దర్యాప్తునకు సహకరించడం లేదు. తప్పుడు సమాధానాలతో దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారు’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుకు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజును సిట్ అధికారులు నిన్న అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి జులై 8 వరకు రిమాండ్ విధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే చీకటి గది మాత్రమే కాదు.. చేసిన తప్పును తెలియజేసి సన్మార్గులుగా మార్చే సంస్కరణాలయం అని నిరూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ.