
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Under Construction Warehouse Collapsed In Kolkata: వరుసగా జరుగుతున్న ప్రమాదాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.. పాత నిర్మాణాలు కాదు.. నిర్మాణంలో ఉన్న కట్టడాలు కూడా కూలిపోతుండటంతో ఇది కాంట్రాక్టుల నిర్లక్ష్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ కోల్‌కతలోని తార్తలా రవాణా డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న గిడ్డంగి షెడ్డు కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో జరిగింది. శిథిలాల కింద సుమారు 55 మంది ఉండవచ్చని భావిస్తున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. ఈ క్రమంలో గిడ్డంగి కింద నుండి 13 మందిని కాపాడగలిగారు.. అయితే ఇంకా కొందరు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ గిడ్డంగి కాంక్రీట్ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే కోల్ కత్తా పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సేవలతో పాటు సైన్యం కూడా శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా, శిథిలాలను తొలగించేందుకు క్రేన్లను ఉపయోగించి, గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో పోలీసులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు.. మరికొందరు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇనుప శిథిలాల మధ్య చిక్కుకుపోవడం వల్ల వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతున్నప్పటికీ, ఇంకా సమయం పట్టేలా ఉంది. శిథిలాల కింద ఉన్నవారు నొప్పితో అరుస్తున్న శబ్దాలు కూడా వినిపిస్తుండటంతో, గ్యాస్ కట్టర్లతో శిథిలాలను తొలగిస్తూ వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఒక వైపు శ్లాబు పూర్తిగా కూలింది.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, గిడ్డంగులో ఒక భాగం అకస్మాత్తుగా పడిపోవడంతో అందులో ఉన్న కార్మికులు బయటకు రాలేక అక్కడికక్కడే మృతి చెందారు. శ్లాబ్ కింద పనిచేస్తున్న కార్మికులు మొత్తం ఇరుక్కుపోయారు. సమీపంలోని నివాసితులు , మరికొందరు కార్మికులు రక్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది, ఐదుగురు మరణించారు. భద్రతా నియమాలు పాటించకుండా నిర్మాణంలో ఉన్న స్లాబ్ ఎలా కూలిందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఈ ఘటనకు కారణమైన వారిని ఉరితీయాలని బిజెపి కార్యకర్తలు డిమాండ్ చేశారు. తమ కార్యకర్తలు ఇప్పటివరకు పదిమందిని కాపాడారని, ఇందులో రాజకీయాలకు తావులేదని, తప్పిదం ఎవరిదో ఖచ్చితంగా తేల్చాలని వారు అన్నారు. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించడానికి తాము కూడా ప్రయత్నిస్తున్నామని చెబుతూనే, హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు.
ఇక కోల్‌కతాలోని గార్డెన్ రిచ్ ప్రాంతంలో కూడా నిర్మాణంలో ఉన్న ఐదంస్థుల భవనం కూలింది. 2024లో కూడా ఇలాంటి ఘటన జరిగి 12 మంది మరణించారు. ఇది కూడా నిబంధనల ఉల్లంఘనతో కూడిన అనధికార నిర్మాణం వల్లనే జరిగిందని సమాచారం. అంతకుముందు 2023 జూలైలో కూడా నిర్మాణంలో ఉన్న మరో స్లాబ్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.