
Rakhi Sawant Marriage For Money: చిత్రసీమలో సెలబ్రిటీల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు.. ఆ తర్వాత విడాకులు సర్వసాధారణంగా మారాయి. ఇలాంటి వార్తలు ఎప్పుడూ వచ్చినా.. నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారు
తాయి. ఇప్పుడు అలాంటి ఓ షాకింగ్ కామెంట్ ఇచ్చింది నటి రాఖీ సావంత్. "డబ్బు కోసం నేను పది మంది భర్తలనైనా మారుస్తాను" అంటూ బహిరంగ ప్రకటన చేసింది.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ తన వ్యక్తిగత జీవితం.. ఆర్థిక ఇబ్బందులపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేసింది. "నాకు జీవితంలో డబ్బే అత్యంత ముఖ్యం. పేదరికం నుండి తప్పించుకోవడానికి.. లగ్జరీ జీవితాన్ని గడపడానికి నేను పది మంది మొగుళ్లనైనా మార్చడానికి రెడీ. డబ్బు కోసం ఏదైనా చేస్తాను.
డబ్బు లేకుండా నేను బతకలేను. నాకున్న డిప్రెషన్‌ను కేవలం డబ్బు మాత్రమే తగ్గించగలదు" అంటూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారాయి.
1997లో 'అగ్నిచక్ర' సినిమాతో బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఖీ సావంత్.. హీరోయిన్గా కంటే తన స్పెషల్ సాంగ్స్, ఐటెం నంబర్లతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పోలిస్తే ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
హిందీ 'బిగ్ బాస్' మొదటి సీజన్ (2006) లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి టాప్-4 లో నిలిచిన రాఖీ, ఆ తర్వాత 2015తో పాటు మరికొన్ని సీజన్లలోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సందడి చేసింది.
రాఖీ సావంత్ జీవితంలో ప్రేమ, పెళ్లి అనే బంధాలు ఎప్పుడూ కలసిరాలేదు. గతంలో ఆమె చేసుకున్న పెళ్లిళ్లు వివాదాలు, పోలీస్ కేసుల వరకు వెళ్లి విడాకులతో ముగిశాయి. ప్రస్తుతం సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్న రాఖీ.. దుబాయ్‌లో ఒంటరిగా నివసిస్తోంది.
ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని కొందరు భావిస్తుండగా, కేవలం పబ్లిసిటీ కోసమే రాఖీ సావంత్ ఇలాంటి సంచలన ప్రకటనలు చేస్తుంటుందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా, ఆమె చేసిన ఈ తాజా కామెంట్స్ మాత్రం ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో దుమారం రేపుతున్నాయి.