
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Vemulawada Temple News: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ చేతుల మీదుగా తిప్పాపురం గోశాలలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. మొదటి విడతగా బుధవారం రోజున 200 కోడెలను అర్హులైన రైతులకు అందజేశారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ.. స్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా.. ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నిజమైన.. అర్హులైన పేద రైతులను మాత్రమే ఎంపిక చేసినట్లు ఆమె వెల్లడించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకే ఈ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
రాజన్న ప్రసాదంగా భావించండి: కలెక్టర్ పిలుపు.. రైతులకు కోడెలను అందజేసిన అనంతరం కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.. రైతు సోదరులారా.. ఈ కోడెలను కేవలం పశువులుగా కాకుండా.. వేములవాడ రాజన్న ప్రసాదంగా.. స్వామివారి ఆశీస్సుల రూపంగా భావించాలని.. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అవసరాలకు లేదా విక్రయించడానికి వీల్లేదని.. కేవలం మీ వ్యవసాయ పనులకు, సాగు ఉత్పాదకతను పెంచుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని కోరారు..
ఉచితంగా కోడెలను అందుకున్న రైతుల ఆనందానికి అవధులు లేవు.. వేములవాడ రాజన్నను దర్శించుకుని, కోడెలను ఇంటికి తీసుకెళ్తుండటంతో తిప్పాపురం గోశాల పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.. ఎద్దులను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న తమకు, స్వామివారి కోడెలు వ్యవసాయానికి ఎంతో ఆసరాగా నిలుస్తాయని లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.