
అసలు ఓటర్ల జాబితాలో మీరు ఉందా? ఏమైనా తప్పులు ఉన్నాయా? మీకు పలు చోట్ల ఓటు హక్కు ఉందా? అయితే, ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే..
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రారంభం కానుంది. ఇందులో రాష్ట్రంలోని ఓటర్లకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తారు. ఈ జాబితాలో ఏమైనా తేడాలుంటే సవరిస్తారు. అవసరానికి మించి ఉంటే తొలగిస్తారు..
ప్రత్యేక సమగ్ర సవరణ ఏంటి? : ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అనేది ఎన్నికల సంఘం చేపట్టే కీలకమైన ప్రాసెస్.. ఓటర్ల జాబితా సరిగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయడమే దీని ఉద్దేశ్యం. అంటే.. నిజంగా ఎవరికైనా ఓటు హక్కు ఉంటే అలాంటి ప్రతి పౌరుడి పేరు ఈ ఓటర్ల జాబితాలో కచ్చితంగా ఉండి తీరాలి. అలాగే మరణించినవారు, వలస వెళ్లినవారు లేదంటే తప్పుగా రిజిస్టర్ అయినవారి పేర్లు ఈ జాబితా నుంచి తొలగించాలి.
ఈ పని ఎందుకు అవసరం అంటే.. రోజురోజుకు చాలామంది ప్రజలు ఏదో ఒక కారణం చేత ఒక ఊరు నుంచి మరో ఊరికి వలస వెళ్తున్నారు. కొందరు ఒకటి కన్నా ఎక్కువ ప్రాంతాల్లో తమ ఓటు హక్కును రిజిస్టర్ చేసుకుంటున్నారు. అలాగే, మరికొందరి పేర్లు మరణం తర్వాత కూడా అలాగే ఓటర్ల జాబితాలో ఉంటున్నాయి.
ఇలా జరిగితే ఎన్నికలపై రానురాను ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలను సరిచేయడానికే SIRను ప్రత్యేకంగా నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఎప్పటినుంచి ప్రారంభమవుతుంది? కాల వ్యవధి ఎంత? ఎన్ని దశల్లో జరుగనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Read Also : PF Withdraw : ఇష్టం వచ్చినట్టు పీఎఫ్ విత్ డ్రా చేసేస్తున్నారా?.. మీకు షాకింగ్ న్యూస్.. మీకే తెలియకుండా మీ డబ్బులు..
చివరగా 01/10/2026న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. అంటే ఎన్నికల్లో వాడే అధికారిక ఫైనల్ జాబితా ఇదే అనమాట.. ఫైనల్గా చెప్పాలంటే.. SIR అనేది ఓటర్ల జాబితాను కేవలం పేర్ల జాబితానే కాకుండా అసలైన అర్హుల వివరాలతో అందించే సమగ్రంగా అందించే ప్రక్రియగా చెప్పవచ్చు.