
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Infinix Note 60 Pro Pininfarina Limited Edition: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) భారతీయ మొబైల్ ప్రియుల కోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను అందించేందుకు రెడీ అయ్యింది.. ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ డిజైనింగ్ సంస్థ Pininfarina భాగస్వామ్యంతో సరికొత్త Infinix Note 60 Pro Pininfarina Limited Edition స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం అధికారికంగా లాంచ్ చేసింది. ఇది రూ.40,000 లోపు బడ్జెట్ విభాగంలో ప్రీమియం లుక్‌తో పాటు అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడం విశేషం..
స్పార్ట్స్ కార్ తరహా డిజైన్.. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని డిజైన్ అని భావించవచ్చు.. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకెళ్లే లగ్జరీ స్పోర్ట్స్ కార్ల స్ఫూర్తితో దీని వెనుక ప్యానెల్‌ను కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ (Carbon Fibre Finish)తో తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఫోన్‌కు మరింత దృఢంగా ఉండేందుకు 360-డిగ్రీల ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కూడా అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది.. ఇది ఫోన్‌కు అత్యంత ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇది క్లాసీ టోరినో బ్లాక్ (Torino Black) కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రావడం విశేషం..
డిస్ప్లే, ప్రాసెసర్ అద్భుతం.. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ల్పేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనికి స్క్రీన్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 (Snapdragon 7s Gen 4) 4nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్‌కు అద్భుతంగా సరిపోతుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
6500mAh భారీ బ్యాటరీ.. బ్యాటరీ పరంగా ఇన్ఫినిక్స్ ఎక్కడా రాజీ పడలేన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 6,500mAh గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు అలాగే 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు.. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ఐస్‌కోర్ 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉంచచడం విశేషం..
కెమెరా, ఇతర స్పెషల్ ఫీచర్స్.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. దీని ద్వారా 4K నాణ్యతతో వీడియోలను రికార్డ్ చేసే అవకాశం కూడా లభిస్తోంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ వెనుక కెమెరా పక్కన నోటిఫికేషన్లు, యానిమేషన్ల కోసం ప్రత్యేకమైన యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే (Active Matrix Display)ను అందుబాటులో ఉంచడం విశేషం. అంతేకాకుండా ఫోన్ కుడి వైపున హెల్త్ మానిటరింగ్ సెన్సార్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
ధర వివరాలు.. భారత మార్కెట్లో Infinix Note 60 Pro Pininfarina Limited Edition కేవలం 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ. 37,999తో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart)తో పాటు ఇన్ఫినిక్స్ ఇండియా అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.