
ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన తరుచుగా మాట్లాడే పదం… సంపద సృష్టి.
తమన్నా (Tamannaah Bhatia) కూడా ఆయననే స్ఫూర్తిగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
త మన్నా కేవలం నటి మాత్రమే కాదు, ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త కూడా. 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ.. ఆ తర్వాత కొన్నేళ్లకు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. తాజాగా ఈ ఏడాది ఆమె తమన్నా ఫైన్ జ్యువెలరీ’ అనే సరికొత్త లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా, సంపద సృష్టిపై తన అభిప్రాయాలను పంచుకుంది. కేవలం డబ్బు కోసమే కాకుండా.. కొత్త విషయాలను సృష్టించడం, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం, విలువలను పెంచడం తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది తమన్నా.
ఒక పరిమితి దాటిన తర్వాత ఎంత డబ్బు ఉన్నా దాంతో పెద్దగా చేసేదేమీ ఉండదని ఆమె అభిప్రాయపడింది. సంపాదించిన సంపదను ఎవరూ తమతో పాటు పైకి తీసుకువెళ్లలేరని అంటోంది.
సో.. డబ్బు సంపాదన కంటే, తన వ్యాపారాన్ని లేదా పనిని మరింత పైకి తీసుకెళ్తూ, నలుగుర్నీ తనతో పాటు వృద్ధి లోకి తీసుకురావడమే అసలైన సంపద అంటోంది తమన్న. అలా ఎంత ఎక్కువమందిని వృద్ధిలోకి తీసుకొస్తే, తనకు అంత ఆనందం అంటోంది. సంపద సృష్టించడంలో ఆనందం ఉంది అని చెప్తోంది.
తమన్న నికర ఆస్తి విలువ వంద కోట్ల రూపాయల పైనే ఉంటుంది.