
హైదరాబాద్: స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడని (Venkaiah Naidu) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సమయ పాలనలో ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
హైదరాబాద్‌లో ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
‘‘చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు. అసెంబ్లీలో ఆయన చేసిన ఉపన్యాసాలు అందరికీ ఆదర్శం. తెలుగు రాష్ట్రాల్లో నేతలు గౌరవం తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు అసెంబ్లీలోని వెంకయ్య ఉపన్యాసాలు వినాలి. రైతులు, గ్రామాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేశారు’’ - కిషన్‌రెడ్డి
‘‘వెంకయ్యనాయుడు అలుపెరగని నాయకుడు. సమయ పాలన, నిబద్ధతలో ఆయన రాజీపడరు. ఎవరు ఫోన్ చేసినా తిరిగి కాల్ చేసి మాట్లాడే నాయకుడాయన. ఈర్ష్య, ద్వేషం లేని వ్యక్తి. ప్రతి వేదికపై తెలుగు భాష గురించి మాట్లాడతారు. సమాజంలోనే ఎక్కువగా ఆయన గడుపుతారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే నాయకుడు వెంకయ్య. ఆర్టికల్ 370 బిల్లు సభలో ప్రవేశ పెట్టినప్పుడు దాన్ని పాస్ చేయించిన ఘనత ఆయనదే’’ - బండారు దత్తాత్రేయ
‘‘కుగ్రామంలో పుట్టి, దేశంలోనే రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన అరుదైన వ్యక్తి వెంకయ్యనాయుడు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటూ.. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో విలువలతో కూడిన ప్రయాణం సాగించిన ఘనత ఆయనకే దక్కుతుంది. బాల్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించి పట్టుదలతో చదువుకున్నారు. నేడు నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే దానికి వెంకయ్యనాయుడు చూపిన చొరవ, అందించిన ప్రోత్సాహమే కారణం. దేశవ్యాప్తంగా ఎంతోమంది నిబద్ధత కలిగిన ఉత్తమ నాయకులను తయారు చేసిన గొప్ప మార్గదర్శి వెంకయ్యనాయుడు’’ - భూపతిరాజు శ్రీనివాసవర్మ
‘‘దేశంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడి పాత్ర ఎనలేనిది. నేడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి జరిగిందంటే ఆయన చొరవే. వెంకయ్య బాల్యం, సాధించిన విజయాలు ఈ పుస్తకంలో అద్భుతంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో పుస్తకం రాస్తే అది కచ్చితంగా ఆయన గురించే ఉంటుంది. ఏపీకి పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ప్రధాన కారణం వెంకయ్యనాయుడే’’- ఏపీ మంత్రి సత్యకుమార్
‘‘వెంకయ్య నాయుడిది అద్భుత జీవిత ప్రస్థానం. సాధారణ విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఉపరాష్ట్రపతిగా అంచలంచెలుగా ఎదిగారు. క్షణం తీరిక లేకుండా కొత్త ఆలోచనలతో ముందుకెళ్లే గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. వెంకయ్యనాయుడిది అసాధారణ జ్ఞాపకశక్తి.. పాతికేళ్ల కిందటి పరిచయాన్ని కూడా ఇట్టే గుర్తుపడతారు. రామేశ్వరంలో అబ్దుల్ కలాం స్మారక నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు’’- డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ దాదాపు 17 మందిని గాయపరిచింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోని విద్యుత్ తీగలను దొంగిలిస్తూ నిందితులు దొరికిపోయారు.