
సాక్షి,హైదరాబాద్: మెట్రో రైలు విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. మెట్రో రైల్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు.
Jun 23 2026 3:08 PM | Updated on Jun 23 2026 3:10 PM
సాక్షి,హైదరాబాద్: మెట్రో రైలు విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. మెట్రో రైల్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఈ తాజా ఒప్పందం ప్రకారం.. ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను ఎస్బీఐ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయితే, ఈ కొత్త పరిణామంతో గతంలో చర్చల్లో ఉన్న ఐఎఫ్ఆర్సీ రుణం సీన్ నుంచి పూర్తిగా మాయమవ్వడం గమనార్హం.
కేంద్ర ప్రతిపాదనల ప్రకారం మెట్రో ఫేజ్-1కు సంబంధించి మళ్లీ కొత్తగా విలువ నిర్ధారణ (వాల్యుయేషన్) ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ వాల్యుయేషన్ పూర్తయిన తర్వాతే, ప్రాజెక్ట్ స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, తగిన ఆర్థిక సంస్థ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాతే మెట్రో ఫేజ్-2 విస్తరణ, దానికి అయ్యే నిర్మాణ వ్యయం,నిధుల సేకరణ అంశాలపై క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహిస్తారు.
ఈ ఎస్బీఐ కన్సల్టెన్సీ అధ్యయన ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని నియమించనున్నారు. వీరిద్దరూ సమన్వయం చేసుకుంటూ కన్సల్టెన్సీకి అవసరమైన వివరాలను అందిస్తారు. ఈ సంస్థ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే హైదరాబాద్ మెట్రో విస్తరణపై భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేయనున్నారు. కేంద్రం తెచ్చిన ఈ కొత్త విధానం వల్ల మెట్రో విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికి రావడమే కాకుండా, పనుల్లో మరింత ఆలస్యం జరిగేలా కనిపిస్తోంది.
ఈ ఎస్బీఐ కన్సల్టెన్సీ తన అధ్యయనాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే గడువుపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. దీంతో మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు ఎప్పుడు పట్టాలెక్కుతాయనే దానిపై సందిగ్ధత నెలకొంది.
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)
హైదరాబాద్ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
నందు పెద్ద నంగనాచి డబ్బులు ఇచ్చేదాకా.. ఎలా మోసం చేశారంటే
చేజారిన వరల్డ్ రికార్డ్.. కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డాడు..!
సోదరా.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పిఠాపురం నా సొంతం...
నా భార్య బ్యాగ్ లో GPS ట్రాకర్ పెట్టడానికి కారణం
సఫారీల చేతిలో ఓటమి, భారత్ సెమీస్ కు వెళ్లాలంటే..!