అమెరికా తన విదేశాంగ విధానంలో కీలక మార్పులు చేస్తూ.. ఇరాన్ చమురుపై 60 రోజుల పాటు ఆంక్షలకు సడలింపు ఇచ్చింది. ఆగస్టు 21 వరకు ఇది అమల్లో ఉంటుంది.
ఇరాన్‌తో విస్తృత శాంతి ఒప్పందం కోసం జరుగుతోన్న చర్చల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌కు ఈ పరిణామం వల్ల భారీ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల తక్షణమే ఇరాన్ ట్యాంకర్లు భారత్‌కు రాకపోవచ్చు కానీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్థిరంగా ఉన్న తరుణంలో భారత్‌కు మరో చమురు వనరు అందుబాటులోకి వచ్చే అవకాశం కల్పించింది. గత కొన్నేళ్లలో న్యూఢిల్లీకి ఇటువంటి అవకాశం రావడం ఇదే మొదటిసారి.అమెరికా ప్రకటన ఏంటి?ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్‌కు సంబంధించిన లావాదేవీలను అనుమతిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ ఒక తాత్కాలిక సాధారణ లైసెన్సును జారీ చేసింది. ఈ మినహాయింపు షిప్పింగ్, బీమా, బ్యాంకింగ్ వంటి అనుబంధ సేవలకు కూడా వర్తిస్తుంది. ఇది ఆగస్టు 21 వరకు చెల్లుబాటులో ఉంటుంది.అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలకు ఇరాన్ అనుమతించడం, విస్తృత దౌత్య చర్చలలో పాల్గొనడంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను శాశ్వతంగా ఎత్తివేయడంగా కాకుండా, విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా పరిగణిస్తున్నారు. ఈ నిర్ణయం చమురు మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపింది. అదనపు సరఫరాలు మార్కెట్లోకి వస్తాయని వ్యాపారులు అంచనా వేయడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి.భారత్‌పై ప్రభావం ఎంత?భారత్ వినియోగించే ఇంధనంలో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే సేకరిస్తోంది. అందుకే అంతర్జాతీయ చమురు ధరలలో వచ్చే మార్పు న్యూఢిల్లీని ప్రభావితం చేస్తాయి. క్రూడాయిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ భారత దిగుమతి బిల్లులను పెంచి, ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తోంది. చివరకు వినియోగదారులపై భారం పడుతుంది. అయితే, గత నాలుగేళ్లుగా భారత ఇంధన దిగుమతుల సరళి నాటకీయంగా మారింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే ముఖ్యమైన దేశాల్లో ఒకటిగా మారిపోయింది. ప్రస్తుతం భారత్ ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం ఆ దేశం నుంచి వస్తోంది. ఇదే సమయంలో సౌదీ, అరేబియా, ఇరాక్, యూఏఈ సహా గల్ఫ్ దేశాల నుంచి కూడా భారీగా దిగుమతులు చేసుకుంటోంది. 2025లో భారత్ ముడి చమురు దిగుమతులలో దాదాపు సగం వాటా ఒపెక్ దేశాలదే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగినప్పుడల్లా సరఫరా గొలుసుకు ప్రమాదాలను సృష్టిస్తుంది. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేయడం వల్ల భారత్‌కు మరో ముఖ్యమైన సరఫరా వనరును అందుబాటులోకి వస్తుంది.ఇరాన్- భారత్ మధ్య దీర్ఘకాలిక సంబంధాలుఅమెరికా 2018లో ఆంక్షల విధించడానికి ముందు భారత్‌కు ప్రధాన ఇంధన సరఫరాదారుల్లో ఇరాన్ కూడా ఒకటి. ఇతర సరఫరాదారులతో పోలిస్తే పోటీ ధర, అనుకూలమైన రుణ నిబంధనలు, తక్కువ రవాణా ఖర్చుల కారణంగా భారతీయ రిఫైనరీలు ఇరాన్ ముడి చమురుకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. కానీ, అమెరికా ఆంక్షలు కారణంగా ఇరాన్ దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం తాత్కాలికంగానైనా ఒక అవకాశం ఏర్పడితే, భారతీయ రిఫైనరీలు, ఇరాన్ మధ్య చర్చలను పునరుద్ధరించగలదు.భారత్ తక్షణమే ఇరాన్ చమురు కొనుగోలు చేయగలదా?అయితే, అమెరికా నిర్ణయంతో వెంటనే ఇరాన్ చమురు కొనుగోలు సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుత మినహాయింపు 60 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది దౌత్య చర్చలతో ముడిపడి ఉంది. సాధారణంగా రిఫైనరీలు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసే ముందు దీర్ఘకాలిక స్పష్టతను కోరుకుంటాయి. ఒకవేళ చర్చలు సఫలమైతే ఇరాన్ చమురు క్రమంగా ప్రపంచ మార్కెట్లలోకి వస్తుందనే సంకేతాన్ని ఈ నిర్ణయం వెల్లడించింది. ఆ ఒక్క పరిణామమే భారతదేశానికి మేలు చేస్తుంది. మార్కెట్లో చమురు సరఫరా పెరిగితే ధరలు తగ్గి, కొనుగోలుదారులకు బేరమాడే శక్తి పెరుగుతుంది. భారత్ ఇరాన్ నుంచి నేరుగా కొనుగోళ్లు పెంచకపోయినా, ప్రపంచవ్యాప్తంగా అదనపు సరఫరా రావడం వల్ల ధరలు అదుపులో ఉండి, దేశ దిగుమతి ఖర్చులు తగ్గుతాయి.హర్మూజ్ జల సంధి అంశంభారత్ నిశితంగా గమనించడానికి మరో కారణం హర్మూజ్ జలసంధి. పర్షియన్ గల్ఫ్‌ను ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించే ఈ జలమార్గం ద్వారా భారతదేశ చమురు దిగుమతులలో గణనీయమైన భాగం వస్తుంది. ఇటీవలి ఉద్రిక్తతలు సరఫరాకు అంతరాయాలు, చమురు ధరలలో భారీ పెరుగుదల వంటి భయాలను పెంచాయి. అమెరికా-ఇరాన్ ఒప్పందంలో సముద్ర భద్రత, హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానం వంటి ఉన్నాయి. ఈ మార్గం గుండా జరిగే ఇంధన సరఫరాలపై ఎక్కువగా ఆధారపడిన భారత్.. హర్మూజ్ చుట్టూ ఉన్న ప్రమాదాలు ఏమాత్రం తగ్గినా అది సానుకూల పరిణామమే.