
సంప్రదాయ మోటార్‌సైకిళ్లకు పెట్టింది పేరైన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 'ఫ్లయింగ్ ఫ్లీ C6' పేరుతో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది.
జూన్ 19 నుంచి బెంగళూరులో దీని డెలివరీలు మొదలయ్యాయి. పాతకాలపు డిజైన్, ఆధునిక టెక్నాలజీ కలయికతో వస్తున్న ఈ బైక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఫ్లయింగ్ ఫ్లీ C6 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని షోరూమ్ ధర రూ.2.79 లక్షలు. అయితే 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' ప్లాన్ ఎంచుకుంటే ప్రారంభ ధర రూ.1.99 లక్షలకే వస్తుంది. దీంతో బైక్ కొనేటప్పుడు కట్టాల్సిన డబ్బు భారీగా తగ్గుతుంది. ఈ బైక్ స్టార్మ్ బ్లాక్, ఫ్లీ గ్రీన్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.