
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tamil nadu minister Srinath gifts gold rings for newborns: తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం హోదాలు తొలి పుట్టిన రోజు కావడంతో ఈ బర్త్ డేకు మరింత స్పెషల్ గా చెప్పుకొవచ్చు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కమల్ హసన్, స్టాలీన్, ఖుష్బూ వంటి రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు ప్రత్యేకంగా బర్త్ డే విషేస్ చెప్పారు. ఈ క్రమంలో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున సేవ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.
పలు చోట్ల అన్నదానాలు, దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు, రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు అపోసిషన్ పార్టీలు ఆరునెలలైన సరే ఈ ప్రభుత్వం నిలవదని పదే పదే ఆరోపణలు చేస్తున్న కూడా సీఎం విజయ్ తనదైన మార్క్ తో పాలన అందిస్తున్నారు.
అయితే సీఎం విజయ్ జన్మదినం వేళ మంత్రి శ్రీనాథ్ తూత్తుకుడి జిల్లాలో చేసిన కార్యక్రమం అందరిని ఫిదా చేసింది. జూన్ 22 ముఖ్యమంత్రి విజయ్ జన్మదినం రోజున తూత్తుకుడి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మొత్తం ఆరుగురు శిశువులు జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీనాథ్ ఆస్పత్రికి వెళ్లి నవజాత శిశువుల్ని చూసి , వారి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా.. శిశువులకు ప్రత్యేకంగా ఉంగారాలను చేతికి తొడిగి వారి కుటుంబ సభ్యుల్ని సర్ ప్రైజ్ చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు ఆశ్చర్యపోయారు.
మొత్తంగా సీఎం విజయ్ దళపతిపై మంత్రి తనకున్న అభిమానంను ఈ విధంగా చాటుకున్నారు. తమ పిల్లలు సీఎం విజయ్ జన్మదినం రాజు పుట్టడం, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బంగారు ఉంగారాలు అందుకొవడంపట్ల ఆ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో పండ్లు, మిఠాయిల్ని సైతం పంచిపెట్టారు.
Read more: HBD Vijay: స్టార్ హీరో నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు.. అసలు సిసలు ‘జన నాయకుడు’ విజయ్ ప్రస్థానం..
ఈ కార్యక్రమంకు చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం విజయ్ అభిమానులు మంత్రి శ్రీనాథ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. మరోవైపు సీఎం విజయ్ దళపతికి ప్రత్యేకంగా బర్త్ డే విషేస్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.