
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
West Bengal DA Hike 2026: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం కొలువు తీరిన నూతన ప్రభుత్వం తన తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ నజరానా ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్ గుప్తా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్లో కరువు భత్యం (డీఏ)పై సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న 18 శాతం డీఏకు అదనంగా.. మరో 20 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సరికొత్త పెంపు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
యువతకు రైతులకు పెద్దపీట ఈ బడ్జెట్ పై రాష్ట్ర ప్రజల్లో ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి 'జన్ కళ్యాణ్ శిబిర్' వేదికగా మాట్లాడుతూ.. జూన్ 22న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో యువత, ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతుల సంక్షేమం కోసం భారీ కార్యక్రమాలను ప్రకటించబోతున్నాం" అని హింట్ ఇచ్చారు.
అందుకు తగ్గట్టుగానే ఈ బడ్జెట్ కొత్త ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను, రాబోయే ఐదేళ్ల అభివృద్ధి రోడ్డు మ్యాపును స్పష్టం చేస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మధ్య ఉన్న 42 శాతం భారీ వ్యత్యాసాన్ని క్రమంగా పూర్తిగా తొలగిస్తామని ముఖ్యమంత్రి సువేందో అధికారి స్పష్టం చేశారు. తాజా బడ్జెట్లో ప్రకటించిన 20 శాతం పెంపు ఆ దిశగా వేసిన కీలక అడుగు అని చెప్పొచ్చు.
పాత బకాయిలు చెల్లింపు.. మరోవైపు, డీఏ అనేది ప్రభుత్వ ఉద్యోగుల చట్టపరమైన హక్కు అని.. 2008 నుంచి 2019 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, 2016 నుంచి 2019 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలు, పే కమిషన్ నిధులను ఇప్పటికే సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసినట్లు ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి వెల్లడించారు. తాజాగా బడ్జెట్ నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో ఆనందం వెళ్లి వివరిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.