సోంపు టీలోని పోషకాలు పేగులను శుభ్రంగా ఉంచుతాయి. తిన్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తాయి.
భోజనం చేసిన తర్వాత సోంఫు టీ తాగితే చాలా మంచిదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్ తెలిపింది.
ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మరసం తాగడం ద్వారా పేగులు క్లీ్న్ అవుతాయి. పేగుల్లో నిలిచిపోయిన గ్యాస్ బయటకు పోతుంది. అలాగే మలబద్ధకం, కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.
చమోమిలే టీలోని గుణాలు పేగు కండరాలను బలంగా మారుస్తాయి. పేగు కదలికలు మెరుగుపర్చి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతాయి. గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
పెప్పరమింట్ టీ తాగడం ద్వారా పేగుల్లో మంట, వాపు తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ తగ్గించేందుకు రోజూ ఈ పెప్పరమింట్ టీ తాగడం మంచిది.
జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి పేగులను క్లీ్న్ చేయడంలో అల్లం టీ సహాయపడుతుంది. గ్యాస్ ట్రబుల్‌తో పాటు వికారం వంటి సమస్యలు తగ్గించేందుకు అల్లం టీ తాగడం మంచిది.
అలోవెరా రసంలోని పోషకాలు పేగుల్లో మంట, వాపు తగ్గిస్తాయి. ఖాళీ కడుపుతో అలోవెరా రసం తాగితే గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
జీలకర్ర నీళ్లు పేగు కదలికలను మెరుగుపర్చి పేరుకుపోయిన గ్యాస్ బయటకు పంపిస్తాయి. దీంతో గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నివారిస్తాయి.
మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచి గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తాయి. మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడి వేసి తాగితే మరీ మంచిది.
భోజనం చేసే సమయంలో, తిన్న తర్వాత నీళ్లు తాగడం మంచిది. దీనివల్ల పేగు కదలికలు బాగుంటాయి. పేగుల్లో ట్రాప్ అయిన గ్యాస్ బయటకు పోతుంది.