
తెలుగు తెరపై కథానాయికలుగా అనుపమా పరమేశ్వరన్ - రెజీనా ఇద్దరూ తమ ప్రతిభను నిరూపించుకున్నవారే. ఇక 'బేబీ' సినిమాతో విరాజ్ అశ్విన్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
అలాంటి ఈ ముగ్గురూ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'మరీచిక'. సతీశ్ కాశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 29వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.హైదరాబాద్ లోని ఒక డిగ్రీ కాలేజ్ లో వెంకటలక్ష్మి (అనుపమా పరమేశ్వరన్) చదువుతూ ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే సంజయ్ ( విరాజ్ అశ్విన్) ఒక కాఫీ షాప్ ను నిర్వహిస్తుంటాడు. తొలిచూపులోనే సంజూపై మనసు పారేసుకున్న వెంకటలక్ష్మీ, అతనికి చేరువ కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే అమెరికా నుంచి వచ్చిన 'మరీచిక' (రెజీనా)తో వెంకటలక్ష్మీకి పరిచయమవుతుంది. చాలా తక్కువ రోజులలోనే వాళ్లిద్దరి మధ్య ఎక్కువ సాన్నిహిత్యం పెరిగిపోతుంది.తల్లిదండ్రులను కోల్పోయిన 'మరీచిక', హైదరాబాద్ లోని తన ఆస్తులను అమ్మేసుకుని తిరిగి అమెరికా వెళ్లే ఆలోచనలో ఉందని వెంకటలక్ష్మి తెలుసుకుంటుంది. వెంకటలక్ష్మితో పాటు తన కాఫీ షాప్ కి వచ్చిన మరీచికతో సంజూ మాటలు కలుపుతాడు. వాళ్లిద్దరి మధ్య పరిచయం చాలా ఫాస్టుగా ప్రేమగా మారిపోతుంది. అయితే సంజూ తనకి దక్కకుండా పోతుండటాన్ని వెంకటలక్ష్మీ భరించలేకపోతుంది. వాళ్లిద్దరూ గుళ్లో చేసుకున్న పెళ్లికి ఆమె ఒక ప్రధానమైన సాక్షిగా ఉండిపోతుంది.ఒకానొక సమయంలో తనకి మరీచిక చెప్పిన మాటలన్నీ అసత్యాలని వెంకటలక్ష్మి తెలుసుకుంటుంది. ఆ సమాచారాన్ని రహస్యంగా సంజూకి చేరవేస్తుంది. అయితే ఆ విషయాన్ని గ్రహించిన మరీచిక, హనీమూన్ పేరుతో సంజూని బయల్దేరదీస్తుంది. పొలిమేరలలోకి వెళ్లగానే సంజూపై ఎటాక్ చేస్తుంది. సంజూ స్నేహితులను తన వైపుకు తిప్పుకుని, వాళ్లతో కలిసి అతణ్ణి హత్య చేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన వెంకటలక్ష్మీ ఏం చేస్తుంది? పర్యవసానంగా చోటుచేసుకునే సంఘటనలు ఎలాంటివి? అనేది కథ.ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మొదలవుతుంది. సంజూను వెంకటలక్ష్మి ప్రేమించడం .. ఆమె స్నేహితురాలైన 'మరీచిక'ను సంజూ లవ్ చేయడం .. ఈ ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూస్తూ వెంకటలక్ష్మి రగిలిపోవడం వంటి సన్నివేశాలతో ఈ కథ నడుస్తూ ఉంటుంది. సంజూని ఒక పథకం ప్రకారం మరీచిక హత్య చేసిందంటూ పోలీస్ స్టేషన్ కి వెంకటలక్ష్మీ పరిగెత్తుకు రావడంతో కథలో ఆసక్తికరమైన అంశం మొదలవుతుంది. ఆస్తుల కోసం మరీచికను సంజూ వలలో వేసుకుంటున్నాడా? లేదంటే అతని దగ్గరున్న కోట్ల రూపాయలను కొల్లగొట్టడానికి మరీచిక ప్లాన్ చేసిందా? అనే ఒక సందేహం ఆడియన్స్ ను వెంటాడుతూ ఉంటుంది. మానసిక పరమైన ఒక వ్యాధితో వెంకటలక్ష్మి బాధపడుతుందంటూ ఇచ్చిన ట్విస్ట్ తో కథ మరో మలుపు తీసుకుని ఆడియన్స్ కి మరో క్వశ్చన్ మార్క్ వదులుతుంది. ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తరువాత, అంతకుముందు జరిగిన కథలోని సన్నివేశాలు మారిపోతూ వెళ్లడం ఉత్కంఠను పెంచుతుంది. ఇక ఈ కథ ప్రీ క్లైమాక్స్ కి చేరుకుంటూ ఉండగా, హారర్ టచ్ కూడా ఇచ్చేశారు. దాంతో క్రైమ్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ అంశాలను ఒకే కథలో కలిపేసి అందించినట్టుగా అనిపిస్తుంది.కథ చకచకా మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తేల్చుకోనీయని ఒక గందరగోళంలో నుంచి ఉత్కంఠను వెలికి తీయడానికి ప్రయత్నిస్తుంది. అయినా రొటీన్ బారి నుంచి తప్పించుకోలేకపోతుంది.ఈ కథ ఎక్కడెక్కడో తిరుగుతూ చివరికి పోలీస్ స్టేషన్ కి చేరుకుంటూ ఉంటుంది. అయితే పోలీసులు అక్కడికి వచ్చిన వాళ్లను ప్రశ్నించి అప్పటికప్పుడే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ కోసం క్లైమాక్స్ లో గానీ కాలు బయటికి పెట్టరు. ఇలాంటి లాజిక్కులు పట్టించుకోకుండా ఫాలో అయితే ఓ మాదిరిగా అనిపించే కంటెంట్ ఇది.రెజీనా .. అనుపమా పరమేశ్వరన్ .. విరాజ్ .. అజయ్ ఘోష్ నటన ఆకట్టుకుంటుంది. అరవింద్ ఫొటోగ్రఫీ .. ఇళయరాజా సంగీతం .. జునైద్ సిద్ధికీ ఎడిటింగ్ ఫరవాలేదు. 'మరీచిక' అంటే 'ఎండమావి' అని అర్థం. దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి. అక్కడివరకూ వెళితే అక్కడి నుంచి మరికొంత దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తాయి. అలా ఇదే నిజం అనుకోగానే అసలు జరిగింది ఇది అంటూ మరో అంశం తెరపైకి వస్తుంది. ఆ రకంగా చూసుకుంటే టైటిల్ సెట్ అయిందనే చెప్పాలి.ట్రయాంగిల్ లవ్ స్టోరీలా మొదలుపెట్టి, ఆ తరువాత క్రైమ్ .. హారర్ .. ఎమోషన్ టచ్ ఇస్తూ వెళ్లిన తీరు బాగానే ఉంది. కానీ ఏ అంశానికి సంబంధించి కూడా గాఢత కనిపించదు. హృదయానికి హత్తుకునే అంశాలు లేకపోవడం .. లాజిక్ కి అందని సన్నివేశాలు ఎక్కువ సమయాన్ని తీసుకోవడం .. ఎటొచ్చి రొటీన్ బారిన పడటం అసంతృప్తిన