
ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాల ద్వారా కారం పొడి స్వచ్ఛమైనదా? కల్తీదా అనేది సులభంగా గుర్తించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: నేటి రోజుల్లో పాలు, పెరుగు, జున్ను, పండ్లు, కూరగాయలు మాత్రమే కాదు.. మనం రోజూ వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో కూడా కల్తీ పెరుగుతోంది. ముఖ్యంగా కారం పొడిలో రంగులు, ఇతర హానికర పదార్థాలు కలిపే ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎరుపు రంగు కోసం కారం పొడిలో సుడాన్ రెడ్, రోడమైన్-బి వంటి హానికర రసాయనాలను ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీరు వాడుతున్న కారం పొడి స్వచ్ఛమైనదేనా కాదా అనేది ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ కారం పొడి వేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి.
నీరు బాగా ఎర్రగా మారితే అందులో కృత్రిమ రంగులు కలిపి ఉండే అవకాశం ఉంది.
కొద్దిగా కారం పొడిని అరచేతిలో వేసుకుని రుద్దండి.
ముదురు ఎరుపు రంగు చేతికి బలంగా అంటుకుంటే అది కల్తీకి సంకేతం కావచ్చు.
స్వచ్ఛమైన కారం పొడి సహజమైన, లేత ఎరుపు రంగును మాత్రమే ఇస్తుంది.
కొద్దిగా కారం పొడిలో నిమ్మరసం, కొద్దిగా నీరు కలపండి.
బుడగలు ఏర్పడితే అందులో సబ్బు పొడి లేదా వాషింగ్ సోడా వంటి పదార్థాలు కలిపి ఉండవచ్చు.
రంగులో అకస్మాత్తుగా మార్పు కనిపించినా కల్తీకి సంకేతం కావచ్చు.
స్వచ్ఛమైన కారం పొడికి సహజమైన ఘాటు వాసన, కారం రుచి ఉంటాయి.
ఘాటు తక్కువగా అనిపిస్తే కల్తీ అయి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
నాణ్యమైన బ్రాండ్లకు ప్రాధాన్యం ఇవ్వడం, విశ్వసనీయ దుకాణాల నుంచే కారం పొడిని కొనుగోలు చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా కల్తీ ఆహార పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుంచి మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
చికెన్ రెసిపీలకు వెల్లుల్లి పేస్ట్ మంచిదా.. తరిగిన వెల్లుల్లి మంచిదా?