
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
NEET Re-Exam Paper 2026: దేశవ్యాప్తంగా సర్వత్రాత్మక ఆసక్తి రేపిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం అనగా జూన్ 21 నాడు అత్యంత కఠిన భద్రత ఏర్పాట్లు నడుమ ప్రశాంతంగా ముగిసింది. మే నెలలో జరిగిన తొలి పరీక్షతో పోలిస్తే, ఈ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం విద్యార్థులకు చుక్కలు చూపించిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో కఠినంగా రావడంతో ఈసారి నీటి కట్-ఆఫ్ మార్కులు భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత 37 రోజుల్లో రీ-ఎగ్జామ్.. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాల్లో కలిపి మొత్తం 5,440 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్ష నిర్వహించింది. దాదాపు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన ఈ పరీక్ష కోసం అధికారులు మునుపేన్నడు లేని విధంగా 1.38 లక్షల సీసీటీవీ కెమెరాల ద్వారా 95 వేల పరీక్ష గదులను నిశితంగా ప్రవేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రధాన కార్యాలయం నుంచి స్వయంగా పరీక్షలను సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో కేవలం 37 రోజుల్లోనే రెండోసారి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ టఫ్.. మే 3న జరిగిన మొదటి పరీక్షతో పోలిస్తే ఈసారి రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) సబ్జెక్టు అత్యంత కఠినంగా రావడమే కాకుండా, ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఒక నాలుగు-ఐదు ప్రశ్నలు విద్యార్థులకు తీవ్ర గందరగోళాన్ని గురిచేసేలా వచ్చాయని అంటున్నారు.
కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో న్యూమరికల్స్ మెమొరీ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడిగారట. ఇవి కూడా లెక్కల కట్టడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో స్కోరింగ్ తగ్గే అవకాశం ఉంది.
బయాలజీ.. బోటనీ, జువాలజీ ప్రశ్నలు పూర్తిగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి రావడంతో విద్యార్థులకు పెద్ద ఊరటం ఇచ్చింది. ఇందులో మంచి స్కూలు సాధించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
భారీగా తగ్గనున్న కటాఫ్ మార్కులు ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్న నేపథ్యంలో ఈసారి టాప్ స్కోర్ 700 నుంచి 710 మార్కుల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అది ఓపెన్ క్యాటగిరి కట్ ఆఫ్ మార్కులు 487 ఉండగా.. ఈసారి కటాఫ్ మార్కులు భారీగా తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. పేపర్ కఠినత్వాన్ని బట్టి చూస్తే యావరేజ్ మార్కులు సాధించిన విద్యార్థులకు సైతం మెడికల్ సీటు దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.