సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. బివీ నందినీ రెడ్డి దర్శకత్వంలో సామ్ భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ఫ్యామిలీ క్రైమ్ కామెడీ డ్రామా ఇది.
జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు మిక్సెడ్ టాక్ వచ్చినా, రివ్యూలు ఏమంత గొప్పగా లేకపోయినా.. ఎవరూ ఊహించిన విధంగా వసూళ్లు రాబడుతోంది. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 3 రోజుల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మా ఇంటి బంగారం’ మూవీ తొలి రోజు రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. రెండు రోజుల్లో రూ.28 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు సాధించింది. ఆదివారం నాడు రూ.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో 43 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర బృందం తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, ఇవాళో రేపో రూ.50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఓవర్ సీస్ లో ‘మా ఇంటి బంగారం’ సినిమా సత్తా చాటుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది. తద్వారా 17 మిలియన్ డాలర్ల సినిమాల్లో భాగమైన సౌత్ ఇండియన్ యాక్టర్ గా సమంత సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఉమెన్ సెంట్రిక్ సినిమాతో సామ్ సంభవం చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎక్కడి దాకా వెళ్తుందో, ఇవాళ మండే టెస్ట్ పాస్ అవుతుందో లేదో చూడాలి.ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని నిర్మించారు. 'శుభం' తర్వాత సామ్ నిర్మాణంలో రూపొందిన రెండో చిత్రమిది. ఇందులో గుల్షన్ దేవయ్య విలన్ గా నటించగా.. దిగంత్, గౌతమి, మంజుషా, యాంకర్ శ్రీముఖి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.