
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-1తో సమంగా ఉంది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో కివీస్ 253 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
రెండో టెస్టుకు రెగ్యులర్ సారథి బెన్ స్టోక్స్ దూరం కాగా.. ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌కు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. ఈ జట్టుకు పాయింట్లను తగ్గించింది. ఇప్పటికే పర్సంటేజీ తగ్గగా.. పాయింట్లలోనూ భారీగా కోత పడటంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్ ఏడో స్థానంలో ఉంది.
ఆదివారం న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓడిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో ఈ జట్టు పర్సంటేజీ 34.72 నుంచి 26.38 శాతానికి పడిపోయింది. రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ ఖాతాలో 50 పాయింట్లు ఉన్నాయి. కానీ, ఈ టెస్టులో ఏకంగా 12 ఓవర్లను ఆలస్యంగా వేయడంతో 12 పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాయింట్ల సంఖ్య 50 నుంచి 38కి తగ్గింది. కెప్టెన్‌గా వ్యవహరించిన జో రూట్‌తోపాటు సహచరులందరికీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా పడింది.
స్వదేశంలో సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఇంగ్లాండ్‌కు ఓ గుడ్‌న్యూస్. బాక్సర్తో గొడవ కారణంగా రెండో టెస్టు ఆడలేకపోయిన కెప్టెన్ బెన్ స్టోక్స్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. కివీస్‌తో మూడో టెస్టు కోసం ప్రకటించిన స్క్వాడ్‌లో అతడికి చోటు దక్కింది. కెప్టెన్ రాకతో తుది జట్టులో ఎవరిని పక్కన పెడతారో చూడాలి. జూన్ 25 నుంచి నాటింగ్‌హామ్ వేదికగా మూడోటెస్టు ప్రారంభం కానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.