
అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, డాలర్ హెచ్చుతగ్గులు మన దేశంలో బంగారం ధరలపై గట్టి ప్రభావమే చూపించాయి. ఈ వారం ప్రారంభంలోనే బులియన్ మార్కెట్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది.
ధరలు ఒక్కసారిగా పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్లే ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు అడుగులు వేస్తున్నారు. ఫలితంగానే ఈ రేట్ల పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు.
ఈరోజు మార్కెట్లో ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగి రూ.1,46,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములపై 400 పెరిగి రూ.1,34,300కు చేరింది. ఇక వెండి స్థిరంగా ఉంది. కిలో వెండి రూ.2.55లక్షలు ఉంది.
దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం వంటి సురక్షిత ఆస్తులపై ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా ఎగబాకుతాయి.
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, డాలర్ మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయించనున్నాయి. ఈ అంశాలు అనుకూలంగా ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. లేకపోతే స్వల్పంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రతిరోజూ ధరల మార్పులను గమనిస్తూ సరైన సమయంలో కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.