
కృష్ణవంశీ దగ్గర నందినీ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే.. మొదట నందినీ రెడ్డిని అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకోవడానికి కృష్ణ వంశీ అంగీకరించలేదని..
రమ్యకృష్ణ కారణంగానే ఆఫర్ వచ్చిందని నందినీ రెడ్డి చెప్పారు.
‘ కృష్ణ వంశీ ఎడిటింగ్ పనులు ఎక్కువగా రాత్రిపూట చూసుకుంటారు. ఆ సమయంలో అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటం ఎందుకులే.. అనవసరపు తలనొప్పి అని వద్దు అనుకున్నారు. ఆ ఛాన్స్ అలా మిస్ అయిపోయింది.అయితే... వేరే ఫ్రెండ్ ద్వారా నందినీ రెడ్డికి రమ్యకృష్ణ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఓసారి రమ్యకృష్ణ గారు ఫోన్ చేసినప్పుడు తాను బెంగళూరు వెళ్లిపోతున్నాను అని చెప్పాను. నీకు కన్నడ వచ్చా అని అడిగారు. రాదు..కానీ.. ఇక్కడ ఎవరి దగ్గర అసిస్టెండ్ డైరెక్టర్ గా ఛాన్స్ రావట్లేదని..కృష్ణ వంశీ దగ్గర ఆఫర్ వచ్చినట్లే వచ్చి పోయింది అని చెప్పాను. వెంటనే రమ్యకృష్ణ.. తన భర్త కృష్ణ వంశీకి ఫోన్ చేసి మాట్లాడి.. ఒప్పించారు. మరుసటి రోజు నేను వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. అలా చంద్ర లేఖ మూవీకి పని చేశాను. ’ అని నందినీ రెడ్డి చెప్పారు.
‘ నిన్నే పెళ్లాడతా సినిమా కోసం కూడా వర్క్ చేశాను. దాని కోసం.. చాలా కష్టపడ్డాను. అయితే.. ఎంత పని చేసినా కూడా..కృష్ణ వంశీ తిట్టేవారు. ఒకరోజు ఉదయాన్నే షూటింగ్.. ఆ సమయంలో కూడా నేను సరిగా పని చేయలేదనే బాగా తిట్టాడు. దీంతో.. వెంటనే ఏడ్చేశాను. అక్కడే.. రమ్యకృష్ణ ఉంది. అంతే.. నేను ఏడవడం చూసి.. వెంటనే కృష్ణ వంశీని తిట్టేసింది. తర్వాత వంశీ నాతో మాట్లాడాడు. నువ్వు బాగా పనిచేస్తున్నావ్ అనే కదా నీకు పని చెబుతన్నాను.. నువ్వు ఏడ్చేసి వెళ్లి దానికి చెబుతున్నావ్.. అది నన్ను తిడుతోంది’ అని అన్నారు.
‘మురారీ సినిమా కోసం కూడా మేము చాలా కష్టపడ్డాం. నిజానికి అసిస్టెంట్ డైరెక్టర్ల పేర్లను సినిమా ఎండ్ క్రెడిట్స్ లో వేస్తూ ఉంటారు. కానీ.. ఈ సినిమా కి మేము చాలా కష్ట పడ్డాం అని.. మా పేర్లు టైటిల్స్ మొదట పడేటప్పుడే వేశారు. అలా చూసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది’ అని నందిని రెడ్డి చెప్పారు.