
వేసవిలో ఉష్ణోగ్రతలు ఏటా రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో ఇళ్లల్లో ఏసీలు, ఫ్యాన్లు నిరంతరం పనిచేయాల్సిన పరిస్థితి. దీంతో కరెంట్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయి.
ఫలితంగా ఇంటిని సహజంగానే చల్లగా ఉంచే నిర్మాణ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. అలాంటి వాటిలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది ఈపీఎస్ వాల్ టెక్నాలజీ. సాధారణంగా థర్మోకోల్గా పిలిచే పదార్థంతో నిర్మించే ఈ గోడలు వేడిని అడ్డుకోవడంలో సహాయపడుతున్నాయని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.ఈపీఎస్ అంటే ఏమిటి?ఈపీఎస్ అంటే ‘ఎక్స్పాండెడ్ పాలిస్టైరిన్’. ఇది ప్రత్యేకమైన ఫోమ్ పదార్థం. మనకు సాధారణంగా కనిపించే థర్మోకోల్ కూడా ఇదే కేటగిరీకి చెందినది. ఇందులో పెద్ద మొత్తంలో గాలి బంధించి ఉంటుంది. అందువల్ల వేడి ఒక వైపు నుంచి మరో వైపునకు సులభంగా వెళ్లలేదు. ఈ లక్షణం కారణంగా ఈపీఎస్ను భవనాల గోడలు, పైకప్పులు, ఇన్సులేషన్ వ్యవస్థల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈపీఎస్ ప్యానెల్స్ బరువు తక్కువగా ఉండటంతో నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. పిల్లర్లు, బీమ్లపై బరువు తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.ఇల్లు ఎలా చల్లగా ఉంటుంది?ఈపీఎస్ గోడల ప్రధాన బలం థర్మల్ ఇన్సులేషన్. పదార్థంలో ఉండే క్లోజ్డ్-సెల్ నిర్మాణం గాలిని బంధించి ఉంచుతుంది. ఆ గాలి పొర వేడి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా బయట ఎండ తీవ్రంగా ఉన్నా ఆ వేడి నేరుగా ఇంట్లోకి చేరదు. సాధారణ ఇటుక గోడలతో పోలిస్తే ఇంటి లోపలి ఉష్ణోగ్రత మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలపై ఆధారపడటం కొంత తగ్గవచ్చు. దీర్ఘకాలంలో