
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Uria Shortage: కాంగ్రెస్ పాలనలో రైతులు పరేషాన్ అవుతున్నారని.. మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ రాత మారుతుందని భావిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయినట్లు రైతులు చెబుతున్నారని గుర్తుచేశారు. ఆన్లైన్లో బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నారు.. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
అచ్చంపేట పర్యటనకు వెళ్తుండగా మాజీ మంత్రి హరీశ్ రావు మార్గమధ్యలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఆగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడకు వచ్చిన హారీశ్ రావును చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేసి.. అనంతరం తమ గోడు వెళ్లబోసుకున్నారు. 'ఆన్లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నాం. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కొనుగోళ్లలో తరుగు, ఆగిపోయిన పాల బిల్లులతో అరిగోస పడుతున్నాం' అని వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని.. మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ రాత మారుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లయ్య అనే రైతుతో మాట్లాడగా.. అతడు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తమ కష్టాలు వెళ్లబోసుకున్నాడు.
హరీశ్ రావు: యూరియా దొరికిందా> రైతు ఎల్లయ్య: అసలు యూరియా దొరకడం లేdi. స్మార్ట్ఫోన్లలో ఆన్లైన్ బుకింగ్ చేస్తేనే యూరియా ఇస్తామంటున్నారు. మా దగ్గర చిన్న ఫోన్లు (కీప్యాడ్ ఫోన్లు) ఉంటే ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. తీరా షాపు దగ్గరికి వెళ్లేసరికి స్టాక్ అయిపోయిందని చెబుతున్నారు. చేసేదేం లేక బ్లాక్‌లో యూరియా బస్తాలు తెచ్చుకోవాల్సి వస్తోంది. యూరియా కావాలంటే ఏమాత్రం అవసరం లేని ఇతర మందుల ప్యాకెట్లను కొనాలని షాపుల వాళ్లు బలవంతపెడుతున్నారు.
హరీశ్ రావు: కరెంటు పరిస్థితి ఎలా ఉంది? రైతు ఎల్లయ్య: కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అసలు అర్థమే కావడం లేదు. యాసంగిలో వడ్లు, మక్కలు అమ్మినప్పుడు కొనుగోలు కేంద్రాల్లో విపరీతంగా తరుగు తీశారు. పాల బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోంది. రైతు ఎల్లయ్య: గతంలో (కేసీఆర్ ప్రభుత్వం) నెలకు రెండుసార్లు క్రమం తప్పకుండా వచ్చే పాల బిల్లులు వచ్చేవి. ఇప్పుడు సక్రమంగా రావడం లేదు. ఒక బిల్లు వేసి మూడు బిల్లులు ఆపుతున్నారు. లీటర్‌కు ఇచ్చే ధర కూడా తగ్గించారు.
హరీశ్ రావు: కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరిగ్గా ఇవ్వకపోగా, రైతుబంధు, బోనస్ లాంటివి కూడా ఎగ్గొట్టింdr. రైతులు: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకపై మక్కలు, జొన్నలు కొనమని చెబుతోంది. మరి మేం ఏం పంటలు వేసుకోవాలి, ఎలా బతకాలి? రైతులు: ఏదేమైనా మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతుల రాత మారుతుందని, ఆయన ఉన్నప్పుడే తాము సంతోషంగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి చూసి కాంగ్రెస్‌కు ఓటేసినందుకు రైతులు, జనాలు ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారు