
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ వర్గాల్లో ఒక షాకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టులో భారీ మార్పులు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గత 3 సీజన్లలో కెప్టెన్‌గా విఫలమైన హార్దిక్ పాండ్యాను వదులుకోవాలని యాజమాన్యం తీవ్రంగా యోచిస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ ధరకు తెచ్చుకున్నా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఒక నయా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ముంబై జట్టులోకి తీసుకునేందుకు తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. హార్దిక్ పాండ్యాను రాజస్థాన్‌కు ఇచ్చి.. బదులుగా జైస్వాల్‌ను ట్రేడ్ చేసుకునేందుకు ముంబై గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఐపీఎల్ ట్రేడ్ విండోలో ఇదే అత్యంత బిగ్గెస్ట్ డీల్ కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రస్తుతం ఒక ధనాధన్ ఓపెనింగ్ బ్యాటర్ అత్యవసరంగా మారాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడిన అనుభవం ఉన్న యశస్వీ జైస్వాల్ అయితే జట్టుకు కరెక్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు. దీంతో ఈ ట్రేడింగ్ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ముంబై మేనేజ్మెంట్ చూస్తోంది. ఈ డీల్ గనుక సక్సెస్ అయితే ఐపీఎల్ హిస్టరీలోనే ఇదొక సంచలనంగా మారడం ఖాయం. ఇదిలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజూ సామ్సన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిన తర్వాత యశస్వీ జైస్వాల్ ఆ జట్టులో స్టార్‌గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీతో పోటీ పెరగడం వల్ల జైస్వాల్ కూడా ఫ్రాంచైజీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితంగా ఈ క్రేజీ ట్రేడ్ డీల్‌కు ఇరువైపులా మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కేవలం హార్దిక్ పాండ్యాపైనే కాకుండా ఇతర సీనియర్లపై కూడా దృష్టి పెట్టింది. జట్టు ఫ్యూచర్ స్టార్స్ అయిన సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ భవిష్యత్తుపై కూడా యాజమాన్యం ఆలోచనలు చేస్తోంది. కొత్త ఎరా కోసం జట్టును పూర్తిగా రీబిల్డ్ చేయాలనే పట్టుదలతో ముంబై మేనేజ్మెంట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్ల స్థానంలో యువ రక్తాన్ని నింపడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ ట్రేడింగ్ అప్డేట్స్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐపీఎల్ ట్రేడ్ విండోలో ఇలాంటి భారీ మార్పులు సహజమే అయినప్పటికీ.. హార్దిక్, జైస్వాల్ డీల్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మెగా ట్రేడ్‌పై ముంబై, రాజస్థాన్ ఫ్రాంచైజీలు ఎలాంటి అధికారిక ప్రకటన చేస్తాయో చూడాలి.