
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు.
Jun 22 2026 7:29 PM | Updated on Jun 22 2026 7:41 PM
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ మూవీతోనే పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ..' తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్‌కు కూడా వస్తోంది. తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు' అని అన్నారు.
హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మేము గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. మేము ఒక రియల్ లైఫ్ మా సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజేస్ పంపుతున్నారు. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. సింగిల్ స్క్రీన్స్‌లో వంద రూపాయలే టికెట్ నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది' అని అన్నారు. ఈ చిత్రంలో వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ కీలక పాత్రలు పోషించారు.
అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు
చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)
సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు