సింహ రాశి వారికి సూర్యుడే అధిపతిగా ఉంటాడు. ఈ సమయంలో సూర్యుడు తన స్థానాన్ని మారడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. శుక్రుడి అనుగ్రహంతో ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు ఉన్నతాధికారు
ల ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ లభించొచ్చు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరగనుంది. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
తులా రాశి వారికి సూర్య, శుక్ర గ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయం మీకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రెండు గ్రహాల అనుగ్రహంతో ఒక ప్రత్యేక యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ధైర్యసాహసాలు పెరుగుతాయి. మీ ప్రియమైన వారి నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన పనులలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి.
మకర రాశి వారికి శుక్రుడు, సూర్య సంచారం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా పురోగతి సాధించొచ్చు. శుక్రుడి అనుగ్రహంతో మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు రావొచ్చు. పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. ఈ కాలంలో మీరు ప్రత్యేకమైన వ్యక్తిని పొందే అవకాశాలున్నాయి.
కుంభ రాశి వారికి సూర్య, శుక్రుని అనుగ్రహం వల్ల అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించొచ్చు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ మాటతీరుతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవ్వొచ్చు. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి