
స్కూటరా? త్రీ వీలరా? ఒక్కసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు! 100km రేంజ్‌తో BeiGo X4
BeiGo X4 Electric Trike.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కొత్త ప్రయోగాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా Bengaluruకు చెందిన iGowise Mobility స్కూటర్, త్రీ-వీలర్ కలయికను గుర్తు చేసే BeiGo X4ను తీసుకొచ్చింది. రెండు చక్రాల వాహనంలా మలుపులు తిరిగే సౌలభ్యంతో పాటు మూడు చక్రాల స్థిరత్వాన్ని అందించేలా దీన్ని రూపొందించారు. నగర ప్రయాణాలకు ఇది కొత్త ఆప్షన్‌గా మారనుంది.






