
Imd rain fall predictions: రానున్న ఆరు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
ఈ క్రమంలో ముఖ్యంగా హైదారాబాద్ లో వర్షాల అలర్ట్ తో సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలు, స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక వైపు వర్షాలు పడుతున్న ఆతర్వాత మరల ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో రానున్న ఆరు రోజుల పాటు పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలుపడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. అదే విధంగా.. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, గద్వాలలో వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్ లో మరికొన్ని గంటల్లో వర్షం దంచి కొడుతుందని ఐఎండీ హెచ్చరికలతో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
ముఖ్యంగా ఐటీ కంపెనీలు, స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నార్మల్ గా వర్షం ఎక్కువగా సాయంకాలంలో కురుస్తుంటంతో ఐటీ కంపెనీలు సైతం లాగౌట్ సమయాలు సాయంత్రం పూట, స్కూళ్లు కూడా సాయంత్రం వదలడంతో ఒక్కసారిగా రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ నెలకొంటుంది.
ఒక వైపు వర్షాలు, మరోవైపు ఉద్యోగులు, స్కూళ్ పిల్లలు, వాహనాలు రోడ్లపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు మధ్యాహ్నం 3.30 నుంచి దశల వారిగా ఉద్యోగులకు లాగౌట్ వెసులుబాటు కల్పించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలోని స్కూళ్లకు సైతం అధికారులు పలు సూచనలు చేశారు. దీంతో సాయంత్రం వేళ ఒక్కసారిగా రోడ్లన్ని టూవీలర్ లు, కార్లతో నిండిపోకుండా ట్రాఫిక్ సమస్యల్ని అరికట్టవచ్చని అధికారులు సూచించారు. మరోవైపుట్రాఫిక్ సమస్యలు ఏర్పడే ప్రాంతాలలో అధికారులు కీలక చర్యలు తీసుకున్నారు.
వరద నీళ్లతో నిలిచిపోయే మ్యాన్ హోళ్ల విషయంలో, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా నీళ్లు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వర్షాకాలంలో హైదరాబాద్ లో ఎక్కడైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తితే తానే రంగంలోకి దిగుతునని వార్నింగ్ కూడా ఇచ్చారు.
మానవ తప్పిదాలు జరిగితే అధికారులపై కూడా కఠిన చట్టాలు తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేయడంతో అన్ని శాఖల అధికారులు సైతం ఐఎండీ భారీ వర్షాల సూచనలతో అలర్ట్ అయ్యారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని కూడా కీలక సూచనలు చేశారు. మ్యాన్ హోళ్లు, కరెంట్ తీగలు, చెట్లు పడిపోతే సంబంధిత అధికారులకు సూచించాలని ఒక ప్రకటనలో కోరారు.