
Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈరోజు (జూన్ 22) కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు ఇతరులకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. వర్చువల్ (ఆన్లైన్) హాజరుకు కోర్టు నిరాకరించడంతో ఆయన నేరుగా వస్తారా, లేక క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.