
అమెరికాలోని టెక్సాస్‌లో ఆధునిక టెక్నాలజీ విషాదాన్ని మిగిల్చింది. ఆటోమేటెడ్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు ఒకటి అదుపుతప్పి నివాస గృహంలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ హృదయ విదారక ఘటనతో ఆధునిక సాంకేతికతతో నడిచే వాహనాల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం శుక్రవారం (జూన్ 19) రాత్రి 8 గంటల సమయంలో కాటీ నగరంలో జరిగింది. మైఖేల్ బట్లర్ అనే వ్యక్తి తన టెస్లా మోడల్ 3 కారులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారు ఆటోమేటెడ్ డ్రైవింగ్ మోడ్‌లో ఉందని అధికారులు గుర్తించారు. కారు అత్యంత వేగంతో వచ్చి ఇంటి ఇటుక గోడను బద్దలుకొట్టుకుని లోపలికి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంటి ముందు గదిలో ఉన్న మార్తా అవిలా (76) అనే మహిళను కారు బలంగా ఢీకొట్టింది.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మార్తాను వెంటనే మెడికల్ హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన సర్వైలెన్స్ వీడియోను మృతురాలి కుమార్తె జెన్నిఫర్ బార్బర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. "ఈ టెస్లా డ్రైవర్ మా ఇంట్లోకి ఇలా దూసుకొచ్చాడు. మా అమ్మకు ఇలా జరగాల్సింది కాదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. "మా అమ్మ చాలా మంచిది. ఉదార స్వభావి. 76 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో ఆరోగ్యంగా