
Underwear : చాలామంది సిగ్గు, బిడియంతో కొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు... దీంతో కొన్నిసార్లు అనుకోని అనర్థాలు ఎదురవుతాయి. ఇలా లోదుస్తుల గురించి మాట్లాడేందుకు ఇబ్బందిపడేవారు చాలామంది
ఉంటారు... అందుకే వాటి వాడకం గురించి అవగాహన ఉండదు. ముఖ్యంగా అండర్ వేర్ ఎలా వాడాలి? ఓ అండర్ వేర్ ఎన్నిరోజులు వాడాలి? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది... లేదంటే చర్మ సమస్యలతో పాటు అనారోగ్యం తప్పదు.
మనం ధరించే బట్టల కింద అంటే చర్మానికి నేరుగా తాలేలా వేసుకునే దుస్తులను లోదుస్తులు (Innerwear) అంటారు. ఇలా పురుషులు, మహిళలు తమ సౌకర్యానికి తగ్గట్లుగా వివిధ రకాల లోదుస్తులు వాడతారు. శరీరం నుండి విడుదలయ్యే చెమటతో పాటు ఇతర రకాల ద్రవాలను ఈ ఇన్నర్ వేర్స్ పీల్చుకుంటాయి... కాబట్టి తొందరగా పాడయిపోతుంటాయి. అందుకే సాధారణ దుస్తుల్లా ఎక్కువరోజులు వాడకుండా వీటిని తరచూ మారుస్తుండాలి.
పురుషులు, మహిళలు అండర్ వేర్ ఉపయోగిస్తుంటారు... దీన్ని సున్నితమైన జననేంద్రియాల వద్ద వాడుతుంటారు. అంటే చెమటతో పాటు జననేంద్రియాల నుండి విడుదలయ్యే ద్రవాలను కూడా అండర్ వేర్ పీల్చుకుంటుంది. కాబట్టి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పురుషులు అయితే ఓ అండర్ వేర్ 6 నెలల నుండి ఏడాది వరకు వాడవచ్చు... అదే మహిళలు అయితే 3 నుండి 6 నెలలు వాడాలి... ఆ తర్వాత తప్పకుండా మార్చాలి.
అండర్ వేర్ చెమటతో పాటు జననేంద్రియాల ద్రవాలను పీల్చుకుంటుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. వీటివల్ల జననేంద్రియాల వద్ద చర్మం దెబ్బతింటుంది... దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఇతరరకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే వాషింగ్ మెషిన్ లో వేసినా, చేతితో ఉతికినప్పటికీ అండర్ వేర్ ఎక్కువరోజులు వాడటం మంచిదికాదు. కాబట్టి సాధారణంగా ఒక అండర్‌వేర్‌ను 6 నెలల నుండి ఏడాది వరకు వాడిన తర్వాత పారేసి కొత్తవి కొనుక్కోవడం మంచిది.
అండర్ వేర్ ను చాలా సున్నితమైన ప్రాంతాల్లో దరిస్తాం కాబట్టి ఎలాంటి ఫ్యాబ్రిక్ వాడాలన్నది చాలా ముఖ్యం. చెమటతో పాటు ఇతర ద్రవాలను పీల్చుకునేలా ఉండాలి, చర్మానికి హాని కలిగించకుండా ఉండాలి... కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ అండర్ వేర్ లు వాడటం ఉత్తమం. ఇవి గాలి ఆడేలా చేసి చెమటను త్వరగా పీల్చుకుంటాయి. అలాగే ఉతికిన తర్వాత వీటిని నీడలో కాకుండా నేరుగా ఎండలో ఆరబెట్టడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.
అండర్‌వేర్‌ను కచ్చితంగా ప్రతిరోజూ (కనీసం రోజుకు ఒక్కసారైనా) మార్చాలి. ఇక వర్కవుట్స్ చేసినప్పుడు, జిమ్‌కు వెళ్లినప్పుడు లేదా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చెమట పట్టినప్పుడు రోజుకు రెండు సార్లు మార్చడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకే అండర్‌వేర్‌ను ఒకటి కంటే ఎక్కువ రోజులు వాడటం వల్ల చెమట, తడి చేరి బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. ఒక్కసారి వాడిన తర్వాత అండర్ వేర్ ను శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెట్టాలన్నమాట.
వేసుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపించినప్పుడు.