.webp&w=3840&q=75)
సంధ్యా థియేటర్ తొక్కిస లాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం (జూన్ 22) హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సమన్ల మేరకు ఆయన కోర్టుకుహాజరయ్యారు.
2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ను ఎ–11 నిందితుడిగా పేర్కొన్నారు.
చార్జిషీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు కేసును విచారణకు స్వీకరించి, నిందితులకు (జూన్ 22) సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ తన నివాసం నుండి నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు.
.