
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Vijay Birthday Special: స్క్రీన్ పై ఆయన సిగ్నేచర్ స్టెప్ వేస్తే థియేటర్లు ఊగిపోయాయి.అదే వ్యక్తి జనంలోకి వచ్చి ఒకే ఒక్క పిలుపునిస్తే తమిళనాడు రాజకీయ చరిత్రే మారిపోయింది. సరైన సమయంలో ఆయన రాజకీయ ఎంట్రీ అదిరింది. వెండితెర రారాజుగా...దశాబ్దాల పాటు బాక్సాఫీస్‌ను ఏలిన 'దళపతి'....ఇప్పుడు తమిళనాడు అధిపతిగా, తమిళనాడు నయా సీఎంగా సరికొత్త శకానికి నాంది పలికారు. మే 10న తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన జోసెఫ్ విజయ్....సీఎం హోదాలో తన మొదటి పుట్టినరోజున ఈ రోజు జరుపుకుంటున్నారు.
'దళపతి' విజయ్ 52వ వసంతంలోకి అడుగుపెట్టారు. స్క్రీన్ పై జోసెఫ్ విజయ్‌గా ఎంట్రీ ఇచ్చి....కోలీవుడ్ 'ఇండస్ట్రీ హిట్'ల కేరాఫ్ అడ్రస్‌గా మారారు. "విజయ్ సినిమా వస్తోందంటే చాలు.. బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలు రీ-రైట్ అవ్వాల్సిందే. 'గిల్లి', 'పోక్కిరి' చిత్రాలతో మాస్ ఆడియన్స్‌ను కట్టేసిన విజయ్.. 'తుపాకీ' సినిమాతో తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి దళపతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. కథ ఏదైనా, డైరెక్టర్ ఎవరైనా.. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే చాలు థియేటర్లు కలెక్షన్ల సునామీని చూసాయనే చెప్పాలి. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో 'లియో' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న దళపతి విజయ్.. పాలిటిక్స్‌లోనూ సక్సెస్ గా సాగుతున్నారు. ఒకే ఒక్క పిలుపుతో తమిళనాడు రాజకీయ చరిత్రనే మార్చివేశాడు. తమిళనాడు నయా ముఖ్యమంత్రిగా సరికొత్త శకానికి నాంది పలికారు.
అధికారం ఎవరికీ పూలపాన్పు కాదు.. ముఖ్యంగా 60 ఏళ్ల ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టడం అంతకంటే సులువు కాదు.. కానీ, వ్యవస్థను మార్చాలనే సంకల్పం ఉంటే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా జనం గుండెల్లోకి దూసుకెళ్లవచ్చని నిరూపించారు దళపతి విజయ్. రాజకీయ కక్ష సాధింపులు, ఐటీ దాడులు, ప్రతిపక్షాల అవహేళనలను తట్టుకుని నిలబడ్డ నిప్పుల ప్రయాణం విజయ్ దళపతిది.
విజయ్ రాజకీయ ప్రస్థానం.. "విజయ్ రాజకీయ ప్రస్థానం నిన్న మొన్నటిది కాదు.. ఆయన సినిమాల్లో సామాజిక అంశాలు మాట్లాడినప్పుడే పాలకుల కన్ను ఆయనపై పడింది. 'మెర్సల్' సినిమాలో జీఎస్టీ డైలాగులు, 'సర్కార్' సినిమాలో ఉచిత పథకాలపై పెట్టిన సీన్లు అప్పటి అధికార పీఠాలను కదిలించాయి. ఆ కక్షతోనే 'మాస్టర్' సినిమా షూటింగ్ స్పాట్ నుంచి విజయ్ను ఐటీ అధికారులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. రోజుల తరబడి ఐటీ దాడులు, థియేటర్ల వద్ద అడ్డంకులు సృష్టించి ఆయనను మానసికంగా దెబ్బతీయాలని చూశారు. 'విజయ్ ఒక నటుడు మాత్రమే.. పాలిటిక్స్ ఆయనకు సెట్ కావు' అంటూ ప్రతిపక్షాలు హేళన చేశాయి. కానీ, ఆ ఒత్తిళ్లే విజయ్ను ప్రజాక్షేత్రంలోకి వచ్చేలా చేశాయి.
పార్టీ పేరులో ద్రవిడ లేకుండా కేవలం తమిళగ వెట్రి కళగం...TVK పార్టీని స్థాపించి, ఒంటరిగానే బరిలోకి దిగారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సృష్టించిన ప్రభంజనానికి ద్రవిడ పార్టీల 60 ఏళ్ల ఆధిపత్యం ఒక్కసారిగా కుప్పకూలింది. 108 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది TVK. మిత్రపక్షాల మద్దతుతో మే 10న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పెరంబూర్, తిరుచ్చి స్థానాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విజయ్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సరికొత్త రికార్డు సృష్టించారు.అంతేకాదు తిరుచ్చి స్థానానికి రాజీనామా చేశారు.
వెండితెరపై సీఎం సీట్ లో కూర్చుని పొలిటికల్ సిస్టమ్‌ను క్లీన్ చేసిన విజయ్.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ముఖ్యమంత్రిగా...పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేవలం నెల రోజుల్లోనే విజయ్ అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన మార్క్ చూపించారు. 'అందరికీ సమానత్వం' అనే స్లోగన్‌తో అధికారంలోకి వచ్చిన ఆయన.. అవినీతి రహిత పాలనపై మొదటి సంతకం చేశారు. కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో విద్యా నిధులు, రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీ వేదికగా గళమెత్తారు. యువతకు ఉపాధి, మహిళల భద్రత కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తూ.. తాను కేవలం 'రీల్' హీరోని కాదు.. రియల్ లైఫ్ 'రూలర్' అని నిరూపిస్తున్నారు. అంతేకాదు రైతులకు చెప్పినట్టుగా కొంత మేర వారి ఋణ మాఫి చేసి ఇచ్చిన మాట నలిలబెట్టుకున్న నేతగా రికార్డు క్రియేట్ చేశాడు.
జన నాయకుడు.. "అధికారంలోకి రాగానే తన ఎన్నికల మేనిఫెస్టోలోని సంచలన హామీల అమలుపై విజయ్ ఫోకస్ పెట్టారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. విజయ్ చేసిన తొలి సంతకం 'రాష్ట్రంలో విద్యా సంస్కరణలు - ప్రభుత్వ పాఠశాలల ఉచిత డిజిటలైజేషన్' ఫైల్‌పైనే! కార్పొరేట్ చదువులను పేదలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయన పాలన ప్రారంభమైంది. అడ్మినిస్ట్రేషన్‌లో లంచగొండితనానికి తావులేకుండా కేవలం నెల రోజుల్లోనే ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేసి తన 'రూలింగ్ మార్క్' చూపించారు.
ఒకప్పుడు సినిమా డైలాగులతో థియేటర్లలో చప్పట్లు కొట్టించుకున్న విజయ్.. ఇప్పుడు అసెంబ్లీలో ప్రజల గొంతుకయ్యారు. కేసులు, దాడులను ఎదుర్కొని నిలబడ్డ ఆ ధైర్యమే.. ఈరోజు ఆయనను తమిళనాడు అధిపతిని చేసింది. ముఖ్యమంత్రిగా తమిళనాడును సరికొత్త ప్రగతిపథంలో నడిపిస్తూ, ప్రజా రంజక పాలన సాగిస్తున్న దళపతి విజయ్‌కి జీ తెలుగు న్యూస్ స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.