
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మాంచెస్టర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది.
Jun 21 2026 10:35 PM | Updated on Jun 21 2026 10:35 PM
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మాంచెస్టర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. భారత్ నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది.
దక్షిణాఫ్రికా విజయంలో ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్‌ది కీలక పాత్ర. కాప్ (45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. ఆమెతో పాటు ఓపెనర్ బ్రిట్స్(40) రాణించింది. అయితే భారత్ ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫలమ్యనే చెప్పాలి.
మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన కాప్.. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెండు సార్లు కూడా ఆమె ఇచ్చిన క్యాచ్‌లను భారత సబ్‌స్ట్యూట్ ఫీల్డర్ రాధా యాదవ్ జారవిడిచింది. ఆ క్యాచ్‌లు అందుకుని ఉండింటే ఫలితం మరో విధంగా ఉండేది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టింది.
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(29), హర్మన్ ప్రీత్ కౌర్(24), మంధాన(17) పర్వాలేదనిపించారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్, ఇస్మాయల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్బా, అయబోంగ ఖకా, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 25న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..