
దర్శకుడు సుజీత్‌తో ఓజీ-2 చర్చలు. ఓజీ సీక్వెల్‌పై భారీ అంచనాలు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ అప్డేట్. OG Universe: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'ఓజీ' చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ ముందే ఇచ్చిన మాట ప్రకారం, ‘ఓజీ యూనివర్స్’ (OG Universe), 'ఓజీ 2' గురించిన చర్చలు అప్పుడే మొదలయ్యాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు క్రియేటివ్ వర్క్స్ ఆఫీస్‌లో దర్శకుడు సుజీత్‌తో జరిగిన తాజా సమావేశానికి సంబంధించిన అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రేజీ అప్డేట్తో సోషల్ మీడియాలో 'ఓజీ 2' హడావుడి ఒక్కసారిగా నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్ కి షాక్.. అఫిడవిట్లలో రూ.100 కోట్ల తేడా.. హైకోర్టు నోటీసులు గతంలో విడుదలైన 'ఓజీ' మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు రాబోయే సీక్వెల్‌పై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. సుజీత్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్, పవన్ కళ్యాణ్ స్వాగ్ కలబోసి చేసిన ఆ మ్యాజిక్ థియేటర్లలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ నమ్మకంతోనే మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలా కాలంగా ఈ 'ఓజీ 2' ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఇచ్చిన అఫీషియల్ అప్డేట్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ భారీ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ చర్చలు వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అప్డేట్ కూడా రానుందని సమాచారం. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. As promised by @PawanKalyan , #OGUniverse discussions have begun with @Sujeethsign at Creative Works! @MusicThaman#OG2 — Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 21, 2026