
ఇంటర్నెట్‌డెస్క్: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సినీతారలు సందడి చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలు తమ సందేశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకొన్నారు.
ముంబైలో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ , కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో ఈ కార్యక్రమం జరిగింది.
మరోవైపు ఇండియన్ యోగా అసోసియేషన్ అంబాసిడర్, నటుడు విద్యుత్ జమ్వాల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకొన్నారు. ‘‘తల్లిదండ్రులు ఆరోగ్యంపై దృష్టిపెట్టినప్పుడే.. పిల్లలు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారని పేర్కొన్నారు.
హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ తార శిల్పాశెట్టి పాల్గొన్నారు. మరోవైపు టాలీవుడ్ నటి శ్రీలీలా మీడియాతో మాట్లాడుతూ.. నేటి జీవనంలో ఒత్తిడి ఓ భాగమని పేర్కొన్నారు. దీనిని ఎదుర్కోవడానికి హెల్తీ లైఫ్‌స్టైల్ అవసరమన్నారు. ఇందుకోసం యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.