
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఈ టీనేజ్ ఓపెనర్ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఈ టీనేజ్ ఓపెనర్ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి లంక బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. తద్వారా లంక ఆటగాడు కౌశల్య వీరరత్నే (12 బంతుల్లో) పేరిట ఉన్న 21 ఏళ్ల నాటి రికార్డును ఈ బుడ్డోడు బద్దలు కొట్టాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి.
గత మ్యాచ్‌లో లంకతో జరిగిన సూపర్ ఓవర్ ఓటమి, ఆ తర్వాత మైదానంలో జరిగిన ఘర్షణ వాతావరణాన్ని మనసులో ఉంచుకున్న వైభవ్.. ఫైనల్‌కు కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో '100' అని రాసి ప్రతీకారానికి సిద్ధమయ్యాడు. ఊహించినట్లుగానే లంక బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అయితే లంక కెప్టెన్ సహన్ అరాచ్చిగే వేసిన 9వ ఓవర్లో అవుట్ కావడంతో కేవలం 6 పరుగుల దూరంలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అయినప్పటికీ అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ లంకకు వణుకు పుట్టించింది. ఇటీవలే భారత్ సీనియర్ టీ20 జట్టుతో పాటు ఆసియా క్రీడలు 2026కు తొలిసారి ఎంపికైన వైభవ్.. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో సెలెక్టర్ల నమ్మకాన్ని నిజం చేశాడు.
ఫిఫా ప్రపంచ కప్‌లో 1000వ మ్యాచ్.. జపాన్ చారిత్రక విజయం